పరాయి తెలుగునేల ...యానాం!

అస్వతంత్ర భారత దేశంలో ఆంగ్లేయుల పాలనా కాలంలో అవతరించిన నేల ఈ ‘యానాం’ ! పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన ఈ జిల్లా కేంద్రం మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఎదురులంక, ఇంజారం, పల్లెపాలెం, మల్లవరం అను ప్రాంతాలమధ్యన నెలకొనివుందీ ప్రదేశం. షుమారు ౩౦ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఈ నేలలోని జనాభాలో అధిక జనం తెలుగువారే అనటంలో సందేహం లేదు. ‘ఫ్రెంచ్ యానాం ‘అని గతంలో పిలువబడిన ఈజిల్లాలో ప్రాచీన ఫ్రెంచ్ జాతి సంస్కృతి లక్షణాలు యింకా ఆచరణలోవున్నాయి. 300 ఏళ్ల చరిత్ర గలిగిన ఈ యానాంకు 1954లో విదేశీ విముక్తి లభించింది.

కాని బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగుతున్న సమయలో అప్పటి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఆ ప్రభుత్వం విధించిన ’ శారదా చట్టం -1929’లో బాల్యవివాహాల్ని నిషేధించింది. కాని తదనంతర ‘యానాం’లోని ఫ్రెంచ్ ప్రభుత్వపు అనుయాయులు కాస్తా తమ అధికార పాలనలో ఆ బ్రిటిష్ నియమాలకి పూర్తిగా తిలోదకాలు వదిలేసారు. దాంతో యానాంలో చిన్నా పిల్లల పెళ్లిళ్లు నిరాటంకంగా జరిగి పోతూ ఉండేవి. అది అనువుగా తీసుకుని చివరకు దూర దూరపు ఆంద్ర ప్రాంతాలవారీ జనం కూడా యానాంకి వచ్చి స్థానిక దేవాలయాల్లో తమ తమ చిన్న పిల్లల పెళ్ళిళ్ళను నిరాటంకంగా జరుపుకుని వెడుతూ వుండేవారు. ఆ కారణంగా యానాంకి ఫ్రెంచ్ దేశపు పరిపాలనా కాలంలో ‘కల్యాణపురం’ అనే పేరు వచ్చేసింది.

అదే కాలంలో యానాంలో చాలాపెద్దఎత్తున ‘మంగళవారం సంత’ నిర్వహింప బడుతూ వుండేది. ఆ సంతలో విదేశీ వస్తువుల అమ్మకాలు చాలా చవక ధరలకి లభిస్తూ వుండేవి. ఆ వస్తువుల కొనగోలుకై మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుంచి జనం సముద్ర మార్గంగావచ్చి రాక పోకలు సాగిస్తూ వుండేవారు.
అప్పటి కాలంలో గోదావరి నదికి ఎగువ నున్న యానాం వ్యవసాయ భూములకి ధవళేశ్వరం ఆనకట్టనుంచి ఒక కాలువ ప్రవహిస్తూ వుండేది. ఆ కాలువని నేటికీ ‘ఫ్రెంచ్ కెనాల్’ అనే పిలుస్తున్నారు. యిప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని ‘కోరింగా’ అనే పేరుగల నదినుంచి యానాం లోకి “అడవిపాలెం కెనాల్’ పేరిట అదనంగా మరో కాలువ ప్రవహిస్తోంది.

ఈ యానాం ప్రాంతం ఫ్రెంచ్ వారికి ముందుగా క్రీ.శ. 1720లో యూరప్ ఖండానికి చెందిన డచ్ దేశపు ఆధీనంలో వుండేది. వారి పాలనా కాలంలో విదేశీ వ్యాపార నిమిత్తం యానాం చేరుకున్న ఫ్రెంచ్ వ్యాపారస్తులకు స్థానికంగా గిడ్డంగుల సౌకర్యం లభించింది. దాంతో గత్యంతరము లేని పరిస్థితుల్లో ఆ గిడ్డంగుల కాపలా నిమిత్తం ఫ్రెంచ్ ప్రభుత్వం తమదేశ సైన్యాన్నియానాం కు పంపించింది.

ఆ సమకాలీన నేపధ్యంలో విజయనగరాన్ని పాలిస్తోన్నమహారాజుకు బొబ్బిలి రాజ్యాధిపతితో వైరం ఏర్పడింది. దాంతో వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విజయనగర మహారాజుకు ఫ్రెంచ్ కాపలా సైన్యం అనూహ్య సహకారం లభించింది. అందుకు ప్రతిఫలంగా ఆ మహరాజు యానాం ప్రాంతాన్ని ఫ్రెంచ్ దేశానికి బహుమతిగా ప్రకటించటం జరిగింది..

ఆ బహుమతిని స్వీకరించటం కోసం ‘జనరల్ మార్కస్ డే బుస్సీ’ అనీ ఫ్రెంచ్ సైన్యాధికారి యానాంకి వచ్చి స్థిరపడిపోవటం జరిగింది. అప్పటినుంచే అతను మజిలీ చేసిన వీధి ‘బుస్సీ’ వీధిగాపేరు పొందింది.

ఆవిధంగా యానాంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఓమూడు దశాబ్దాలు కొనసాగింది, కాని వారిద్వారా ఏర్పడిన కొన్నిస్థావర అసౌకర్య పరిస్తితులని భరించలేక భారత బ్రిటిష్ ప్రభుత్వం కాస్తా 1758 లో బలవంతంగా వారి పాలనకి ఉద్వాసన పలుకాల్సి వచ్చింది.

ఇక అప్పటినుంచి 1947 దాకా యానాం బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోనే కొనసాగింది, కాని స్వతంత్ర భారత దేశం ఏర్పడ్డాక అప్పటి స్థానికుల వొత్తిళ్ళ కారణంగా ఈప్రాంతం పాండిచ్చేరి రాష్ట్రంలో విలీనం చేయబడింది. పాండిచ్చేరి ‘యానాం’ కి 854 కిలో మీటర్ల దూరంలో వున్నా కూడా యింకా యిక్కడ ఆ రాష్ట్రం అధికారమే కొన సాగుతోంది. అలా తమ రాష్ట్ర సరిహద్దులకి అతి దూరంగా మన రాష్ట్రపు సరిహద్దుల్లోని యానాంతో బాటుగా తమిళనాడులోని ‘కరంకాల్’, కేరళలోని ‘మహి’ అనే ప్రదేశాలు గల పాండిచ్చేరి రాష్ట్రం ఒక్కటే భారత దేశచరిత్రలో నేటికీ కొనసాగుతోంది. పైగా స్థానికులంతా తెలుగు వారే అయినా కూడా వారి ప్రాంతీయ అభిమానాల్లో మార్పు అను లక్షణాలే గోచరించకపోవటం కూడా ఓ విశేషంగానే భావించాల్సి వుంటుంది.

SP Chari

Send a Comment

Your email address will not be published.