పరిశోధనే తన ప్రపంచం

డా. చెన్నుపాటి జగదీష్   

చిరుప్రాయంలో ఒక అందమైన కల.  జీవితపుటంచులు దాటి పైకెగసిన అల.  ఆస్ట్రేలియాలో అడుగిడిన వేళ.  మానవ మనుగడకు ఆనంద హేల.

ఆకాశమే హద్దుగా ప్రపంచమే వలయంగా పరిశోధనే పరమావధిగా మానవభ్యున్నతే  లక్ష్యంగా ఎదిగిన కొద్దీ ఒదిగుండడమే లక్షణంగా భావితరాలకు స్పూర్తిదాయకంగా తెలుగుదనానికి అందలంగా ఎంతోమంది విద్యార్ధులకు గురువుగా వినయవిధేయతలకు మనో ఫలకంగా లెక్కకు మించిన అవార్డుల గ్రహీతగా ఆస్ట్రేలియాలోని ప్రధమ శ్రేణికి చెందిన విశ్వవిద్యాలయంలో ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన వ్యక్తి శ్రీ చెన్నుపాటి జగదీష్ గారు. 

1990 లో ఆస్ట్రేలియా దేశానికీ రీసెర్చ్ సైంటిస్ట్ గా  వచ్చి  వ్రుత్తిలోనూ  ప్రవ్రుత్తిలోనూ  పరిశోధనా రంగాన్నే ఎంచుకొని ప్రస్తుతం  Australian National University లో Distinguished Professor and Head of Semiconductor Optoelectronics and Nanotechnology Group  గా శ్రీ జగదీష్ గారు పనిచేస్తున్నారు.  చాలా గౌరవ పదవుల్ని చేపట్టిన శ్రీ జగదీష్ గారు Vice-President and Secretary Physical Sciences, Australian Academy of Science గా కూడా వున్నారు.  గత పాతికేళ్ళుగా నానో టెక్నాలజీ మరియు సెమి-కండక్టర్  పరిశోధనా రంగంలో ఆరితేరిన శ్రీ జగదీష్ గారు ప్రపంచంలోని నలుమూలల ఈ రంగంలో పనిచేసే వారికి పరిచయస్తులే.  అయితే ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగువారికి ఎక్కువమందికి తెలియదు.  వారు పత్రికలకు, మాధ్యమాలకు కొంచెం దూరంగా వుంటారు.  అంకిత భావంతో పని చేసుకుపోవడం గుర్తింపు తనకు తానుగా తరుముకురావడం అనే పంథాలో జీవితాన్ని సాగిస్తున్నారు.  

శ్రీ జగదీష్ గారు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ దగ్గర వల్లూరిపురం వాస్తవ్యులు.  వారి తండ్రిగారు ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ వ్యవసాయం చేస్తుండేవారు.  ప్రాధమికోభ్యాసం తరువాత ఉన్నత చదువులు చదవడానికి ఎంతో ఇబ్బందిపడే సమయంలో వారి తండ్రి గారి సహచరులు శ్రీ చాగంటి సాంబి రెడ్డి గారు మరియు శ్రీ వల్లూరి శ్రేనివసరావు గారు అందించిన ఆపన్న హస్తంతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేయగలిగానని అందుకు ఇరువురికి జన్మాంతం ఋణ పడి  ఉంటానని  శ్రీ జగదీష్ గారు చెప్పారు.

శ్రీ జగదీష్ గారికి వచ్చిన అవార్డులు, ఫెల్లో షిప్పులు  లెక్కలేనన్ని.  వారు కొన్ని ముఖ్యమైన పత్రికలకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు.  అందులో కొన్ని ముఖ్యమైనవి: 

Honours, Awards and Recognitions: 

 • Distinguished Fellow, Chinese Academy of Sciences President’s International Fellowship Initiative, 2016
 • Silver Jubilee International Medal, Materials Research Society of India, 2016
 • IEEE Nanotechnology Pioneer Award, 2015
 • IEEE Photonics Society Engineering Achievement Award, 2015
 • Walter Boas Medal, Australian Institute of Physics, 2013
 • Electrochemical Society Electronics and Photonics Division Award, 2012
 • Quantum Device Award, International Symposium on Compound Semiconductors, 2010
 • IEEE Third Millennium Medal, 2000
 • IEEE Nanotechnology Council Distinguished Service Award, 2011
 • IEEE Photonics Society Distinguished Service Award, 2010
 • IEEE Distinguished Lecturer of the Electron Devices Society, 1997-2007
 • IEEE Lasers and Electro-Optics Society Distinguished Lecturer Award, 2003-2005
 • IEEE Nanotechnology Council Distinguished Lecturer Award, 2010-2014
 • Peter Baume Award, Australian National University’s most prestigious and highest staff award in recognition of “outstanding record of research achievement, research leadership and extraordinary contributions to Science and to the University”, 2006
 • Australian Research Council Federation Fellowship, 2004-2009
 • Australian Research Council Laureate Fellowship, 2009-2014
 • ANU Top Supervisor Award for excellence in research supervision, 2010Fellowships of Professional Societies:  
  • Fellow, Australian Academy of Science, 2005-present
 • Fellow, Australian Academy of Technological Sciences and Engineering (ATSE), 2002-present
 • Fellow, The World Academy of Sciences (TWAS), 2013-present
 • Fellow, US National Academy of Inventors, 2015-present
 • Fellow, The Institute of Electrical and Electronics Engineers, Inc. (IEEE), 2002-present
 • Fellow, American Physical Society, 2003-present
 • Fellow, Materials Research Society, 2010-present
 • Fellow, American Association for Advancement of Science, 2007-present
 • Fellow, Optical Society of America, 2004-present
 • Fellow, Electrochemical Society, 2006-present
 • Fellow, American Vacuum Society, 2008-present
 • Fellow, International Society for Optical Engineering (SPIE), 2006-present
 • Fellow, Institution of Engineering and Technology (UK), 2007-present
 • Fellow, Institute of Physics (UK) , 1998-present
 • Fellow, Institute of Nanotechnology (UK), 2001-present
 • Fellow, Australian Institute of Physics, 1993-present
 • Academician, Asia-Pacific Academy of Materials, 2013-present
 • Fellow, The Electromagnetics Academy, 2014-present
 • Honorary Member, Materials Research Society of India, 2012-presentEditorial Positions
 • Editor, Light: Science and Applications, Nature Publishing Group, 2014- present
 • Editor, Progress in Quantum Electronics, 2008-2015, Editor-in-Chief, 2016-
 • Editor, Journal of Semiconductor Technology and Science, 2009-present
 • Co-Editor-in-Chief, International Journal of High Speed Electronics and Systems, 2014-present
 • Editor, Springer Series in Materials Science, 2009-present
 • Editor, Springer Series in Nanooptics and Nanophotonics, 2009-present
 • Editor, Elsevier Series in Semiconductors and Semimetals, 2010-present
 • Associate Editor, Applied Physics Reviews, 2013-present
 • Associate Editor, Journal of Physics D: Applied Physics, 2011-present
 • Associate Editor, Beilstein Journal of Nanotechnology, 2011-present
 • Editor, IEEE Electron Device Letters, 2008-2014
 • Editorial Board Member of 19 other journals, i.e. IEEE Photonics Journal, IEEE Nanotechnology Magazine, Physica Status Solidi: Rapid Res. Letts., Nanoscale Res. Letts., Solid State Electronics

డిల్లీలో వున్నపుడు సహోద్యిగిని విద్యగారిని సహధర్మచారిణి గా చేసుకున్నారు.  శ్రీమతి విద్యగారు కూడా Ph.D పట్టా పొందారు.  వీరికి లయ పేరుతో ఒక అమ్మాయి.  రెండేళ్ళ క్రితం పెళ్లి చేసుకొని కాన్బెర్రా లో ఒక  ఫిట్నెస్ సెంటర్ నడుపుతోంది.ఆస్ట్రేలియాలో నానో టేక్నోలోజీలో పరిశోధన చేసే వారికి ఆస్ట్రేలియాలోనూ ఇతర దేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయని శ్రీ జగదీష్ గారు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.