పర్యాటకానికి పెద్ద పీట

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రాష్ట్రంలో 15 ప్రధాన పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి సుమారు వెయ్యికోట్ల రూపాయల ఖర్చుతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయబోతోంది. తెలంగాణా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
ఈ ప్రాంతాలకు క్రమబద్ధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ చక్కని రోడ్లు, కాటేజీల నిర్మాణానికి నడుం బిగిస్తోంది. ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యం తెలిపే వివరాలను ప్రజలకు అందజేయడమే కాకుండా, ప్యాకేజీలు కూడా చేపడుతోంది. రెండేళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని అది అధికారుల ఆదేశించింది. ఇందుకు ఉన్నతాధికారులతో ఒక కార్యాచరణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ అభివృద్ధి వివరాలను ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.