పవన్ కళ్యాన్ స్వచ్చ భారత్

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘స్వచ్చ భారత్ కార్యక్రమంలో తెలుగు సినిమా నటుడు, జన సేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాన్ పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమం కోసం ప్రధాని ఇటీవల వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన ప్రముఖులలో పవన్ కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా వెంకటా చలంలో ఆదివారం నాడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు చెందినా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. “స్వచ్చ భారత్ అంటే చీపుర్లు చేతబట్టుకుని ఫోటోలు దిగడం కాదు. వీధుల్లో పరిశుభ్రత కోసం ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో పని చేయాలి. ఇది చాలా ఏళ్ల పాటు కొనసాగాల్సిన కార్యక్రమం. నేనే కాక, మా అభిమానులంతా ఈ కార్యక్రమానికి వీలయినంత సమయాన్ని కేటాయించ బోతున్నాము. ప్రతి గ్రామంలోనూ మరుగు దొడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకున్నాము”
అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫద్నవీస్, కేంద్రమంత్రి ఆయన ఆలోచనని ప్రశంసించారు.

Send a Comment

Your email address will not be published.