పసందైన విందు

మెల్బోర్న్ తెలుగువారికి శ్రీ రాంపాల్ రెడ్డి ముత్యాల గారి గురించి ప్రత్యెక పరిచయం అవసరం లేదు. విద్యార్ధిగా మెల్బోర్న్ నగరానికి విచ్చేసి తనకంటూ ఒక స్థానాన్ని స్థిరపరచుకొని తనతోపాటే ఎంతోమంది తోటి తెలుగువార్లకు మరియు భారతీయ సంతతికి చెందిన ఎందరికో తనదైన శైలిలో సహాయసహకారలందిస్తున్న శ్రీ రాంపాల్ విక్టోరియా రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా ఒక ముద్ర వేసుకున్నారు. ఇక్కడి లిబరల్ పార్టీ సభ్యునిగా గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందిస్తూ ఓం సాయి సంస్థకు జీవిత  సభ్యునిగా ఉంటూ మనకంటూ ఒక మందిరాన్ని నిర్మంచడానికి అచంచలమైన కృషి సలుపుతున్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం మెల్బోర్న్ సౌత్ ఈస్టర్న్ రీజియన్ మల్టీ కల్చరల్ సభ్యునిగా కూడా నియమించడం జరిగింది. బహుళ సంస్కృతీ పరంపరకు పట్టం కడుతున్న ఆస్ట్రేలియా దేశంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఎక్కడో మారుమూల గ్రామంనుంచి వచ్చి విక్టోరియా రాష్ట్ర రాజకీయ పటంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన తెలుగు బిడ్డ శ్రీ రాంపాల్ వారి శ్రీమతి రాధికతో పాటు  వచ్చే వారాంతంలో జరగబోయే రాష్ట్ర ఎన్నికలను పురస్కరించుకొని ప్రస్తుత రాష్ట్ర ప్రీమియర్ శ్రీ డెన్నిస్ నాఫ్తైన్ వారి గౌరవార్ధం విందుని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి చాలా మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర లిబరల్ పార్టీ ప్రముఖులు విచ్చేసారు.

వీరిలో ప్రముఖులు:
The hon Dr Denis Napthine, Premier
Senator hon Scott Ryan
Senator hon Mith Fifield
Hon Wendy Lovell MLC
Hon Bruce Atkinson MLC
Ms Inga Peulich MLC
Mr Craig Ondarchie MLC
Mr David Southwick MP
Ms Elizabeth Miller MP
Ms Lorraine Wreford MP
Cr Paul Peulich, Mayor
Cr Geoff Gledhill
Cr Karina Okotel

ఈ కార్యక్రమానికి ఛి.అవిటి శర్మ వాచస్పతిగా వ్యవహరించారు. సూర్ బాలీవుడ్ వారు మంచి రసవత్తరమైన నృత్య విభావరి సమకూర్చారు. మన తెలుగువారితో పాటు షుమారు ౩౦౦ పైగా భారతీయ సంతతికి చెందిన సభ్యులు కూడా రావడం విశేషం.
ఆర్ధిక సహాయం అందించిన ప్రముఖుల్లో శ్రీ అనిల్ కర్పూరపు (Dosa Hut) శ్రీ హరీష్ రెడ్డి బిసం (Integrated Accountants) శ్రీ శసీంద్ర అమరనేని (Bright Impex) మరియు  మోహన్ శ్రీనివాస్ దేవంగ (SMS Accountants) వున్నారు.

Send a Comment

Your email address will not be published.