పాత క్రొత్తల మేలికలయిక

మే 4 వ తేదీన మెల్బోర్న్ తెలుగు సంఘం సర్వసభ్య సమావేశం పాయింట్ కుక్ షాపింగ్ సెంటర్ లోని కమ్యునిటీ హాల్ లో జరిగింది.  ఈ కార్యక్రమంలో 2013-14 కార్యవర్గం కొత్త కార్యవర్గానికి (2014-15) సారధ్య బాధ్యతలు అప్పగించడం జరిగింది.  ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు శ్రీ పవన్ సత్య మటంపల్లి గారు మాట్లాడుతూ గత సంవత్సరం జనరంజని మరియు రస రాగ సుధ కార్యక్రమాలతో పాటు మన సంఘ సభ్యులకు ఉపయోగపడే  ఎన్నో దాతృత్వ కార్యక్రమాలను, రక్త దాన శిబిరాలను ఎంతో మంది కార్యకర్తల సహాయ సహకారాలతో చేపట్టినట్లు తెలిపారు. గత సంవత్సరం మన తెలుగు యువత పెక్కు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఇది ఒక శుభసూచకమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమలో గత సంవత్సరం కోశాధికారి శ్రీ శ్రీనివాస్ శేషం వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టి మూజువాణి వోటుతో ఆమోదింప జేసారు.  ఈ సంవత్సరం ఎంతో మంది వ్యాపారవేత్తల సహాయంతో తాయి మూలధనం మరింత వృద్ధి చెందినట్లు శ్రీ శ్రీనివాస్ గారు చెప్పారు. 

తాయి బోర్డు అధ్యక్షులు శ్రీమతి స్వర్ణ భరతుల రాజీనామా చేయగా ఆ పదవికి శ్రీ రఘు బలరాం గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శ్రీ దినేష్ గౌరిశెట్టి  గారి అధ్వర్యంలో 2014-15 సంవత్సరానికి  క్రొత్త సంఘం ఎన్నుకోబడింది.  ఈ కార్యవర్గంలో చాలా మంది ఇంతకు  క్రితమే తాయి మరియు పలు సంస్థల్లో పని చేసిన అపారమైన అనుభవం కలవారే.   క్రొత్త వారి ఉత్సాహం పాతవారి అనుభవం పాత కొత్తల మేలికలయికని పలువురు సభ్యులు అభిప్రాయ పడ్డారు.

సభ్యుల వివరాలు:
అధ్యక్షులు: శ్రీ దినేష్ గౌరిశెట్టి  
ఉపాధ్యక్షులు: శ్రీ హరి శ్రీనివాస్ (2012 -13 సంవత్సరంలో ఉపాధ్యక్షులు గా పని చేశారు)
కార్యదర్శి: శ్రీ గుప్త గోలి
కోశాధికారి: శ్రీ శ్రెనివాస రావు గంగుల (2009 – 10 సంవత్సరంలో  కోశాధికారి గాను మరియు 2010 – 11 సంవత్సరానికి అధ్యక్షులుగా పని చేశారు)
సంయుక్త కార్యదర్శి: రజని చినపల్లి   
ఉప కార్యదర్శి: రాజ శేఖర్ గురజ, శ్రీని కట్ట  
మెంబెర్ 1: చైతన్య రావు

Send a Comment

Your email address will not be published.