పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోమవారం రోజున పీ ఎస్ ఎల్వీని
ప్రయోగించి నింగిలోకి అయిదు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా
ప్రవేశపెట్టింది. ఇది 26వ వరుస విజయం. దీన్ని నెల్లూరు జిల్లాలోని షార్
నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ,
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఆసక్తిగా
తిలకించారు. సార్క్ దేశాలన్నిటి కోసం ప్రత్యేకంగా ఒక ఉపగ్రహాన్ని తయారు
చేసి ప్రయోగించాలని షార్ శాస్త్రవేత్తలను ప్రధాని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత చౌకగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేసపెట్టిన
ఘనత భారత దేశానిదే. వానిజ్యపరమయిన ప్రయోజనాల కోసం భారత్ వీటిని
ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహ ప్రయోగాల వాళ్ళ దూరవిద్య, టెలి మెడిసిన్ వంటివి
మారుమూల ప్రాంతాలకు సైతం అందుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.