పుణ్య స్నానాలు

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల సందర్భంగా నదిలో ఈ రెండు రోజుల్లో సుమారు 45 లక్షల మంది స్నానాలు చేశారు. నిన్న అమావాస్య కూడా కావడంతో కొన్ని లక్షల మంది తర్పణాలు వదిలారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి, కోటి లింగాల, పట్టిసీమ, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో రోజు రోజుకూ యాత్రికుల సంఖ్యా పెరుగుతుండగా, తెలంగాణా రాష్ట్రంలోని ధర్మపురి, బాసర, భద్రాచలం తదితర ప్రాంతాల్లో నదిలో నీరు బాగా తక్కువగా కారణంగా యాత్రికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మొదటి రోజున గోదావరి నదికి రాజమండ్రీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హారతి ఇవ్వగా, ధర్మపురిలో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హారతి ఇచ్చారు. మొదటి రోజున రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోవడంతో, వివిధ ఘాట్ల వద్ద భద్రతను మరింత పెంచారు. రాజమండ్రీలో రెండు వంతెనల మధ్య లేజర్ తెర మీద గోదావరి పుట్టుక, నది విశిష్టత, పుష్కర ప్రాసశ్త్యాలను కన్నుల పండువగా వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పది మంది మంత్రులు, తెలంగాణా రాష్ట్రంలో నలుగు మంత్రులు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.