పుష్కరాలు - ప్రాముఖ్యత

ఉపోద్ఘాతం
భారత దేశములో జలము (నీరు ) పంచ భూతములలో ఒకటిగానే కాక, సాక్షాత్ నారాయణ స్వరూపముగ పరమ పవిత్రమైనదిగా పరిగణిమ్పబడుతున్నది .రంగు ,రుచి ,వాసన,లేనిది, నిర్గుణ మైనది , స్వచ్ఛ మైనది నీరు ఒక్కటే . సమస్త ప్రాణి కోటికి జీవనాధారమైనది.  నారాయణుడు క్షీరాబ్ది శయనుడు ; నార అనగా నీరము లేదా నీరు అని అర్ధము . కనుకనే నారాయణుడు(పురుష సూక్తం). పూజా సమయంలో జలమును ,శిరము పైన , పూజా ద్రవ్యముల పైన ప్రోక్షించుకొని, ఆచమనము చేసి ప్రారంభి స్తారు .కలశ పూజ ,కలశములో నీరు పోసి ,మామిడి ఆకులు ముంచి ,సకల దేవతావాహనము చేసి మంత్ర పూరితము చేస్తారు . తాపసులకు(ఋషులకు )అన్ని వేళలా తమ కమండలములలో పవిత్ర జలములుంటాయి. భోజనమునకు ముందు తను కాళ్ళు కడుగుకొని ,అతిధులకు కాళ్ళు కడిగి కూర్చో బెట్ట వలెను.

జలాశయములు అనేకములు, వాపీ కూప తటాక నది సముద్రములు. అన్నిటిలోకి నదీ(ప్రవాహ) సముద్ర స్నానములే మిక్కిలి శ్శ్రేష్ఠ మైనవి . సనాతనధర్ములకు నదులు దేవతాస్వరూపములు. అన్నిటా గంగా నది పరమ పవిత్రమైనది. గంగా ,గీత ,గోవింద ,గాయత్రి ,గోవు ,మనకు పూజనీయములు. తెలుగు దేశంలో పలు గ్రామీణ ప్రాంతాల్లో గంగను నీటికి పర్యాయ పదంగా వాడుతారు.

నదిలో కానీ , దేవాలయ ప్రాంగణము లోని పుష్కరిణి లో గాని, కేవలము మునకవేసి శిర స్నానం చేయాలి కానీ వళ్ళు తోము కొనుట లాంటి పనులు చెయ్య కూడదు. నడుము లోతు నీటిలో నిలిచి ,సూర్యునికి అభి ముఖంగా సంకల్పం చెప్పుకొని ,అర్ఘ్యమిచ్చి నమస్కరించవలెను. సంకల్పంలో ఏడు పవిత్ర నదీ జలాల్ని ఆవాహిస్తూ ” గంగేచ ,యమునేచ ,గోదావరి ,సరస్వతీ , నర్మదే ,సింధూ ,కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ” అని మంత్రమ్ చెప్పాలి.. సంధ్యా వందనం ,అన్ని వర్ణముల వారికీ విహిత కర్మయిఉన్నది .

ప్రాముఖ్యం
క్రింద ఉదహిరించిన నదీ తీర్థాలు ,ఒక్కొక్కటి ఒక నక్షత్ర రాశికి సంబంధించి ఉన్నవి . ఆ రాశి లో బృహస్పతి ఏ సంవత్సరం ప్రవేశిస్తే ఆ సంవత్సం ఆ నదీ /తీర్థ పుష్కరం . 12 రాశులకు 12 నదీ /తీర్థాలు ; బృహస్పతి సంచారం బట్టి ,12 సం వత్సరాలకి ఒక పర్యాయము ఆ నదీ పుష్కరం . ఆ సంవత్సర కాలము ,పుష్కరుడు (పరమాత్మ )ఆ నదీ జలాల్లో సమస్త దేవతా సమూహం తో ఆవహించి పునీతం చేస్తాడు .ఆది పుష్కరము 12 రోజులు ,అంత్య పుష్కరము 12 రోజులు అతి ముఖ్యమైనవి(ప్రాంతీయ భేదాలు ,సంప్రదాయాలు బట్టి మరి కొన్ని నదులు ,వాటి రాశులు కూడా ఉన్నాయి ) . ఖగోళ ,జ్యోతిష శాస్త్ర ప్రమాణంగా విశ్వ శక్తి (cosmic energy) ఆ జలములందు ఉండి , జనులకు ఆయురారోగ్యములు ,ఆధ్యాత్మిక మనో ప్రవ్రుత్తి కలిగించి సుఖ శాంతులు చేకూరుతాయి . నది పొడుగునా ఎక్కడైనా స్నాన యోగ్యమైనా ప్రధాన క్షేత్రములు ,అక్కడ దేవాలయములు ఉండి ,భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి , స్నానాదులు చేసి ,దైవ దర్శనము ,పురాణ శ్రవణం , ఆధ్యాత్మిక సాంస్క్రుతిక కార్య క్రమములలో పాల్గొంటారు . పెద్ద ఉత్సవ వతావరణం ,వైభవో పేతంగా నెలకొని ఉంటుంది .. గంగానది తీరాన్న కాశీ క్షేత్రము ,గోదావరి తీరంలో రాజమహేంద్ర వరము ప్రసిద్ధములు.

యాత్రికులు ముఖ్యంగా నది ఒడ్డున తమ ,గతించిన మతా పితరులకు ,పూర్వీకులకు , గతించిన బంధు మిత్రులకు కూడా మంత్ర పూర్వకముగా తర్పణము లర్పిస్తారు ; ఇలా పితృ దేవతలను సంతృప్తి చేసినందు వలన వారి ఆత్మలకు శాంతి కలిగి ఉత్తమ లోకాలు పొందగా , ఈ తరం వారు ,వారి ఆశీర్వాదములు అందుకోగలరు.

ఆశీర్వాదములు అందుకోగలరు
నేడు ప్రభుత్వములు ఈ పుష్కరో త్సవ ములకై ప్రజా సౌకర్యంకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం సంతోషించ దగ్గ విషయం .

నది రాశి
గంగ                 మేషం
యమున కర్కాటక
సరస్వతి మిధున
గోదావరి సింహ
కృష్ణ కన్య
తుంగభద్ర మకర
నర్మద వృషభ
సింధు కుంభ
కావేరి తుల
ప్రాణహిత మీన
భీమ (మహారాష్ట్ర) వృశ్చిక
తామ్రపర్ణి (తమిళ నాడు) వృశ్చిక
శంకు తీర్థం కన్య
తప్తి నది ధనస్సు

 

ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు జూలై 14 తేది ,2015 లో భద్రాచల క్షేత్రం లో జరగ నున్నాయి . ఒక కోటి మంది యాత్రికులు వస్తారని అంచనా .

సూర్యుడు ,బృహస్పతి గ్రహ స్థానాలు ఆధారంగా గంగ యమునా సరస్వతి గోదావరి నదులకు కుంభ మేళాలు జరుగుతాయి . ఇక్కడ కుంభం అమృత భాండం ,దేవాసురులచే సముద్ర మధనము లో వెలువడినది . విష్ణువు మోహిని అవతారములో అమృతము పంచుతుండగా కొన్ని బిందువులు భూమిపై రాలిన చోట్ల వెలసిన నదీ క్షేత్రములు నాలుగు ప్రయాగ (అలహాబాద్ ),హరిద్వార్ ,ఉజ్జయిని ,నాసిక్.  

పూర్ణ కుంభ మేళ ప్రయాగలో 12 సంవత్సరముల కొకసారి, మహా కుంభ మేళ ప్రయగాలోనే 144 సంవత్సరాలకి ఒక సారి జరగడం విశేషం . ప్రయాగ గంగ యమునా సరస్వతి సంగమ స్థానం ;( త్రివేణి సంగం ) సరస్వతి నది అదృశ్యంగా అంతర్వాహిని అయి ఉన్నందున గంగ యమునలే మనకు గోచరిస్తాయి .

శ్రీ సరిపల్లె భాస్కర రావు

భువన విజయ సభ్యులు

Send a Comment

Your email address will not be published.