పూలరంగడు సాక్షిగా... జనరంజని

IMG_3821
IMG_0925

IMG_0909

సీతాపతి చలో మెల్బోర్న్ అంటూ మొదటిసారిగా హాస్య కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మెల్బోర్న్ వచ్చి తాయి రజతోత్సవ జనరంజని కార్యక్రమంలో పాల్గొని తెలుగువారినందరినీ రంజింపజేసి హాస్య రత్న బిరుదాంకితుడై నలుగురినీ నవ్వించిన Rao-JuliaBanks_29Oct2016పువ్వులరేడుగా వందనాలందుకున్నాడు. పాతికేళ్ళ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని కొన్ని మధుర స్మృతులను అందరితో పంచుకున్నాడు. తెరపైన, తెరవెనుక, పరిచయమున్నా, లేకున్నా మాట్లాడే వరసలో ఏమీ తేడా లేదు. ఆ చిరుమందహాసం ఒక మధుర జ్ఞాపకం, ఆ చిద్విలాసం ఒక ముద్ద మందారం. మంత్రాలు లేకుండా తన మాటల ఇంద్రజాలంతో మైమరిపించే మాయలోడు మన రాజేంద్రుడు. 200పై చిలుకు చిత్రాల్లో నటించిన నటకిరీటి కధానాయకుని పాత్రకు సరిక్రొత్త నిర్వచనం చెప్పి ఒకప్పటి భారత ప్రధాని శ్రీ పి వి నరసింహారావు గారి ప్రశంసలందుకున్న కళా యశస్వి.

ఈ సందర్భంగా మెల్బోర్న్ తెలుగు సంఘం శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని “హాస్య రత్న” బిరుదుతో సత్కరించడం జరిగింది.

జనరంజని కార్యక్రమంలో నాలుగేళ్ళ వయసు నుండి 70 ఏళ్ల వయసు గల వారు ఎంతోమంది పాల్గొని నృత్యాలు, లఘు నాటికలు, రీ-మిక్స్ డాన్స్ లు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షుమారు 800 పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినట్లు తాయి అధ్యక్షులు శ్రీ రామారావు గారు తెలిపారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కొన్ని చిత్రాలలోని దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా చేసి చూపించిన భాగం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో Ms. జూలియా బ్యాంక్స్ – Chisolm పార్లమెంట్ సభ్యలు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలోని అతి ముఖ్యమైనది కుటుంబంతో సహా వచ్చి ఈ పండగ వాతావరణంలో పాల్గొనడమేనని ఈ సంప్రదాయాన్ని స్థానికులు కూడా అన్వయించుకోవాలని చెప్పారు. బహుళ సంస్కృతీ సంప్రదాయానికి పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో భారతీయుల పాత్ర ఎంతో కొనియాడదగినదని పేర్కొన్నారు.

తాయి అధ్యక్షులు శ్రీ రామారావు మునుగంటి మాట్లాడుతూ గత పాతికేళ్ళుగా తాయి ఒకే త్రాటిపై నిల్చొని తెలుగువారందరినీ కలుపుకుంటూ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రజతోత్సవాలు సందర్భంగా మరెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం జరపనున్నామని తెలిపారు. FTAA (Federation of Telugu Associations in Australia)కు పూర్తి మద్దతునిచ్చి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

తాయి కార్యదర్శి శ్రీ రాజశేఖర్ గురజ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహాయ సహకారాలందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Committee-OnTheStage_29Oct2016

Send a Comment

Your email address will not be published.