పెట్టుబడులకు రెడీ

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమేనంటూ జీ ఏ సి ఇండియా , భారత్ ఫోర్జ్ తదితర కంపెనీలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రక్షణ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తాము సుముఖంగా ఉన్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులు వివరించారు. కొత్తగా ఏర్పడిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, ఈ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గ దామమని  ఆయన చెప్పారు. రాష్ట్రంలో లభించే సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ ఉత్పత్తుల గురించి, ప్రభుత్వం అందించే సహాయ సహకారాల గురించి ఆయన సావధానంగా వారికి వివరించారు.

Send a Comment

Your email address will not be published.