ప్యాకేజీపై కేంద్రం కసరత్తు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్యాజేజీని ప్రకటించే విషయంలో కేంద్రం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల మిగిలిన రాష్ట్రాల నుంచి ఒత్తిడి వచ్ఛే అవకాశం ఉన్నందువల్ల హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించారు. ఆ తరువాత కేంద్రం ప్యాకేజీపై దృష్టి సారించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా కేంద్రాన్ని హెచ్చరించడంతో కేంద్ర వైఖరిలో సానుకూల మార్పు వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటనే ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపారు. అరుణ్ జైట్లీతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఆ తరువాత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడ