ప్రమాణ స్వీకారానికి సిద్ధం

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ
స్వీకారం చేయడానికి రంగం సిద్ధమయింది. జూన్ 2న ఉదయం 8 గంటలకు హైదరాబాద్
నగరంలో తెలంగాణా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర సమితి
అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజునే
రాష్ట్ర విభజనపై అధికారికంగా ప్రకటన వెలువడుతుంది. కాగా జూన్ 8న రాత్రి
7.30 గంటలకు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు గుంటూరు లో
ప్రమాణ స్వీకారం చేస్తారు. తాను ఎక్కడ ప్రమాణస్వీకారం చేస్తే ఆ
ప్రాంతానికి దగ్గరలోనే రాజధాని ఏర్పడుతుందని చంద్రబాబు ప్రకటించారు.
గుంటూరు, విజయవాడ నగరాలను మున్ముందు జంటనగరాల స్థాయిలో అభివృద్ధి
చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎం. వెంకయ్య నాయుడు కూడా
ప్రకటించడాన్ని బట్టి, ఈ రెండు నగరాల మధ్య ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని
ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.