ప్రవాసంలో పల్లె వాసనలు

ప్రవాసంలో పల్లె వాసనలు

Vinayaka_2017_084
Vinayaka_2017_030
హిందూ సాంప్రదాయంలో ఆది దేవునికి ఉన్నంత ఆదరణ మరెవ్వరికీ లేదంటే ఆశ్చర్యం కాదు. భారతీయ పల్లెల్లో అందునా ముఖ్యంగా తెలుగునాట పండగల పర్వం విజ్ఞేస్వరునితోనే మొదలౌతుంది. చిన్నప్పుడు ఎంతో ఆనందంతో కొన్ని నెలల తరబడి ఎదురుచూసి ప్రతీ ఏట ఏడు రోజులు పండగ సంబరాలను అంబరమంతగా చేసుకొని ఇప్పుడు తమ పిల్లలకు (చాలా మంది పిల్లలకు తెలుగు మాట్లాడడం రాకపోయినా) ఆ సువాసనలు చవి చూపించాలన్న ఆతృతతో గత దశాబ్ద కాలం నుండి నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవం ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
Vinayaka_2017_066
పదేళ్లనుండి ప్రతీ సంవత్సరం ఒకటే లక్ష్యం. పిల్లలకు మన సత్సాంప్రదాయం అందివ్వాలని. పూజా కార్యక్రమంలో వారిని భాగస్తులను చేయాలని. భావితరంలో వారే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి పునాదులు వేయాలని. అందులో నిస్సందేహంగా కృతకృత్యులౌతున్నారు కూడా.
Vinayaka_2017_68
ఉదయం ఏడున్నర గంటలనుండి సభాస్థలి అలంకరణతో ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు హారతి పట్టి నిమజ్జనానికి వెళ్ళేంతవరకు ప్ర్రతీ పనిలోనూ పెద్దవాళ్ళ సహాయంతో వీలైనంత వరకూ పిల్లల చేత పనులు చేయడానికి అవకాశమిచ్చి ప్రోత్సహిస్తున్నారు. పూజా కార్యక్రమాలు మొదలైనపుడు వయసును బట్టి పిల్లల చేత పెయింటు వేయించడం, మట్టితో విజ్ఞేశ్వరుని బొమ్మలు తయారు చేయించడం, తలిదండ్రులందరూ తమ పిల్లల్ని తీసుకొని పూజా స్థలికి తరలి వెళ్లి సనాతనంగా వస్తున్న సాష్టాంగ ప్రణామం చేయించడం – ఇవన్నీ భావి తరాలకు అందిస్తున్న అమృత గుళికలు.
Vinayaka_2017_137
భోజన కార్యక్రమం తదుపరి కూచిపూడి, భరతనాట్యం సాంప్రదాయ నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు మరియు పెద్దవాళ్ళు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు లడ్డూ ప్రసాదం వేలం వేయడం తదుపరి పిల్లలకు బహుమతులు అందివ్వడం జరిగింది.

మధ్యహ్నం భోజనం శ్రీ రమణ గారు – సత్యనారాయణ గారు మరియు లింగం గారి సాయంతో అందరికీ ఉచితంగా అందివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి శ్రీ మురళి బుడిగే గారు ధ్వనికి కావలసిన సౌకర్యాలు అందజేసారు. పూజా కార్యక్రమాలు శ్రీ నరసింహ మూర్తిగారు మరియు శ్రీ ఆదిత్య గారు నిర్వహించారు. శ్రీమతి నీలిమ గారు వాచస్పతిగా వ్యవహరించారు. వీరందరికీ మరియు స్వచ్చంద సేవకులకు గణేష్ ఉత్సవ్ కమిటీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Vinayaka_2017_233

Send a Comment

Your email address will not be published.