ప్రేమలో పడ్డాను

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత. అగ్ర హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆర్ లతో వరుసగా నటించిన క్రెడిట్ సమంతకే దక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు … అత్తారింటికి దారేది … రామయ్య వస్తావయ్యా వంటి భారీ చిత్రాల్లో నటించి వరుస హిట్లు సాధించి తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని నిరూపించు కొంది. రామయ్య వస్తావయ్యా సినిమా విజయవంత మైన సందర్భం గా మీడియా కి బోలెడు కబుర్లు చెప్పింది.

రామయ్య వస్తావయ్యా సినిమా ఎవరి కోసం చేశారు?
ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు. హీరో ఎన్.టి.ఆర్. వీరిద్దరితో కలిసి ఇంతకు ముందే బృందావనంలో పని చేసాను. అది చాలా పెద్ద హిట్ అయింది. నాకు, ఎన్.టి.ఆర్ కు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అప్పుడు అందరూ అన్నారు. వారిద్దరితో కలిసి పని చేసే అవకాశం మరోసారి రాగానే సంతోషం గా ఒప్పుకున్నాను.

ఎన్.టి.ఆర్ తో మీరు హీరోయిన్ గా చేసిన రెండు సినిమాల్లోనూ మీకు పోటీగా మరో గ్లామరస్ హీరోయిన్ ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ?
బృందావనం లో కాజోల్, రామయ్యలో శృతి ఉన్నారు. వారిద్దరు కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. అయితే వారు నాకు పోటీ కాదు. సినిమా ప్రపంచం లో ఎవరికీ వారే పోటి.

కమర్షియల్ సినిమాలే చేయడానికి కారణం ఏమిటి?
ప్రత్యేకించి కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తానని రూల్ పెట్టుకోలేదు. ఈగ, ఎటో వెళ్లి పోయింది మనుసు వంటి ప్రయోగాత్మక సినిమాల్లో కూడా చేశాను. ఈగ విజయం సాధించింది, ఎటో వెళ్లి పోయింది నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆర్ట్ సినిమా లో నటిస్తా.

మరి మీ పెళ్లి కబుర్లు ?
ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఒక వ్యక్తి తో ప్రేమ లో పడిన మాట నిజమే. అయితే మా పెళ్లి రహస్యంగా జరగదు. మీ అందర్నీ పిలుస్తాము.

మీ కొత్త సినిమాలు ఏంటి ?
ఈ సంవత్సరం ఎన్.టి.ఆర్. తో ఇంకో సినిమా చేస్తున్నా. వివి.వినాయక్ తో ఒకటి, తమిళం లో ఒకటి చేస్తున్నా. వచ్చే ఏడాది మాత్రం నా ప్రయారిటీ తమిళ, మళయాళ సినిమాలకే.

Send a Comment

Your email address will not be published.