“ఫాషన్ పీకాక్” తీరు వేరు

వ్యాపారం చేయడానికి అపారమైన అనుభవం ఉండనక్కర్లేదు. ఒక అద్భుతమైన ఆలోచనకు రూపకల్పన చేస్తే పదిమందికి అన్నం పెట్టడం, వినియోగదారులు లబ్ది పొందడం, సమసమాజ సమతుల్యానికి వారధి కట్టడం, మనతోపాటు నలుగురు ఎదగడం వంటి ఉన్నతమైన ఆశయాలు నేరవేరుతాయనడంలో సందేహం లేదు.

మార్పు అనేది సహజం. అది అవసరం కూడాను. ఈ శతాబ్దం ఆది నుండి సాంకేతిక అభివృద్ధితో పాటు ఫాషన్ రంగంలో మార్పులు మరింత వేగవంతమై ప్రతీ రోజు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సరిక్రొత్త మార్పు వస్తూనే వుంది. కొన్ని చోట్ల ఉదయం చూసేది సాయంత్రం కనపడదు. కంప్యూటర్ రంగంలో వస్తున్న మార్పులు దీనికి దోహదపడుతున్నాయి. భారతదేశం ఈ మార్పుకి మినహాయింపు కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మూల విలువలను కాపాడుకుంటూ సరిక్రొత్త సరళిలో “మనది” అన్న ధీమాతో దేదీప్యమానమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే రంగురంగుల బట్టలు ఆస్ట్రేలియా దేశంలో అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆకాంక్షతో “ఫాషన్ పీకాక్” పేరుతో ఒక సంస్థను హైమ రెడ్డి వుల్పల మరియు శ్రీ రెడ్డి గారి అధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది.

లోకజ్ఞానమే పెట్టుబడి
image-1

హైమ గారికి డిజిటల్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ లో 15 ఏళ్ల అనుభవం వుంది. శ్రీ రెడ్డి గారు స్వతహాగా వ్యాపార కుటుంబం నుండి వచ్చిన కారణంగా వారు ఇందులో అందెవేసిన చేయి. ఇద్దరి సామర్ధ్యము కలబోసి ఇక్కడి వినియోగదారుల అవసరాలను గుర్తించి దీనికి సామాజిక కోణాన్ని అద్ది వ్యాపారంగా మలిచి కార్యరూపంలో పెట్టారు. ఆలోచన వారిదే అయినా తమ కుటుంబ సభ్యుల సహాయం లేనిదే ముందుకెళ్ళలేమని కుటుంబ సభ్యులను కొనియాడారు.

వ్యాపారం డబ్బుకోసం చేస్తారన్నది నిర్వివాదాంశం. అందులో తప్పు లేదు. అయితే సామాజిక స్పృహ వ్యాపారానికి జోడించి కనుమరుగౌతున్న కళలను పునఃరుద్దరించాలన్న తపనతో భారతదేశంలోని చేనేత పనులు చేసే వారి దగ్గరనుండి నేరుగా (మధ్యవర్తులు లేకుండా) వస్త్ర సేకరణ చేసి ఇక్కడ కూడా లక్షల డాలర్ల పెట్టుబడి లేకుండా అతి తక్కువ ఖర్చుతో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి (రిటైల్ షాప్స్ లేకుండా) వినియోగదారులకు తెలియపరచడం ద్వారా వ్యాపారాభివృద్ధి చెందడం జరుగుతుంది.

రెండు వైపులా గెలుపే

New Image1

• వినియోగదారులు వారి సెలవుల్లో తమ అమూల్యమైన కాలాన్ని షాపింగ్ మాల్స్ లోను, ట్రాఫిక్ లోను కాకుండా కుటుంబ సభ్యులతోను, సన్నిహితులతోను, స్నేహితులతోను గడిపే అవకాశం ఎక్కువుగా వుంటుంది.
• అననుకూలమైన వృత్తులవారికి చేయూతనివ్వడం జరుగుతుంది. వారిలో ఆత్మన్యూనతా భావం తొలగిపోవడానికి, సాంకేతికపరమైన సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది.
• భారతదేశంలోనూ, ఆస్ట్రేలియాలోనూ స్త్రీ నైపుణ్యాభివృద్ధికి మరియు సాధికారతకు తోడ్పడే విధంగా క్రొత్త మార్గాల అన్వేషణ.

సామాజిక కోణం
గత ఐదేళ్ళుగా భారతదేశంలో రైతులు మరియు ముఖ్యంగా చేనేత వృత్తులవారు డబ్బు చేతిలోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అందరూ ఎరిగినదే. తమకు తెలిసిన వృత్తిలోనే అందెవేసిన చేయగా తీర్చిదిద్దడానికి ఒక సుగమమైన మార్గాన్ని చూపించి మేము సైతం మీకు తోడుగా ఉన్నామన్న అభయ హస్తాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం స్త్రీల వస్త్రాలే ఎక్కువగా అమ్మటం జరుగుతుంది. ముందు ముందు పురుషులకు కూడా తగిన వస్త్రాలు తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీమతి హైమ గారు చెప్పారు.

Sculptures & More
వస్త్ర వ్యాపార విస్తరణలో భాగంగా భారతదేశంలో దొరికే శిల్పాలు, హస్త కళా నైపుణ్యాలు గల ఎన్నో అత్యంత సుందరమైన వస్తువులు కూడా ఇప్పుడు దిగుమతి చేసి అమ్మడం జరుగుతుంది. హైదరాబాదులోని “లేపాక్షి” విక్రయ కేంద్రంలో దొరికేవన్ని మీ ఇంటి వాకిట లభ్యమౌతున్నాయి. అక్కడ కొని ఓడలో ఇక్కడకు తెచ్చుకోవడానికి వ్యక్తిగతంగా ఏమీ శ్రమ పడవలసిన అవసరం లేదు. ప్రాచీన కాలం నుండి సాంప్రదాయ భారతీయ కళా సంపదను పరిరక్షించుకోవాలన్న భావనతో మరియు ఈ శిల్ప కళా నైపుణ్యంలో ప్రావీణ్యత గల ఎంతోమంది నిపుణులను ఆదుకోవాలన్న ఆకాంక్షతో ఈ విభాగాన్ని చేపట్టారు.

వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, లాంతర్లు, కామధేను మొదలైనవి లోహాలతో తాయారు చేసిన ప్రతిమలు వున్నాయి.

ప్రస్తుతం ఆన్-లైన్ ఆర్డర్స్ ను కూడా తీసుకుంటున్నారు. గిఫ్ట్ వోచెర్స్ కూడా ఇస్తున్నారు.
వచ్చే 6 నెలల్లో ఆస్ట్రేలియాలోని అన్ని ముఖ్య పట్టణాల్లోను, 12 నెలల్లో న్యూ జిలాండ్ లో ఫ్రాంచైసెస్ ప్రారంభిస్తున్నట్లు శ్రీ రెడ్డి గారు చెప్పారు.

Franchise అవకాశాల గురించి హైమ గారిని గాని శ్రీ రెడ్డి గారిని గానీ ఈ క్రింది ఈమెయులు లేక ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
హైమ : +61 421 435 055
శ్రీరెడ్డి : +61 412 924 745
email: fashionpeacockaus@gmail.com

Send a Comment

Your email address will not be published.