ఫాస్ట్ చెల్లదు

హైదరాబాద్ తో సహా తెలంగాణా రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణా విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీజు రీ ఇమ్బర్స్ మెంట్ ఫర్ తెలంగాణా స్టూడెంట్స్ (ఫాస్ట్) చెల్లదని హై కోర్టు తేల్చి చెప్పింది. ఇక్కడ ఉన్న మిగిలిన రాష్ట్రాల విద్యార్థుల మాటేమిటని అది ప్రశ్నించింది. ఈ విషయంలో తెలంగాణా అంశాన్ని ఎందుకు పైకి తెచ్చారు? ఈ రాష్ట్రం ఏమయినా భారతదేశం బయట ఉందా అని ప్రశ్నించింది. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఇక్కడి పోరులేనని వ్యాఖ్యానించింది. “మీ ఆదేశాలతో వేర్పాటువాదం తలెత్తుతుంది. ఆదాయ పన్నులో వాటా ఇవ్వం అని కేంద్రం అంటే ఎలా అంటూ అది నిలదీసింది. తెలంగాణా విద్యార్థులకు ఆర్ధిక సహాయం పేరిట తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ జీవోపై న్యాయమూర్తులు విరుచుకుపడ్డారు. ఇటువంటి ఆదేశాలు సమైక్య స్ఫూర్తిని దెబ్బ తీస్తాయని హై కోర్టు స్పష్టం చేసింది. ఇదే కాకుండా రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడాన్ని కూడా హై కోర్టు తప్పుబట్టింది. “ఇప్పుడు జనమంతా మీ కార్యాలయాల చుట్టూ తిరగాలా? మార్చకపోతే నష్టం ఏమిటి? మాకు చెప్పకుండా ఈ ఆదేశాలను అమలు చేయవద్దు” అని న్యాయస్థానం గట్టిగా చెప్పింది.

Send a Comment

Your email address will not be published.