ఫిబ్రవరి 2న నగర ఎన్నికలు

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగాలని, 5న ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 150 వార్డులు ఉన్నాయి. ఇందులో 75 వార్డులను అంటే సగం వార్డులను మహిళలకు కేటాయించారు. వార్డులకు ఎన్నికలు జరిగి, కార్పొరేటర్ లను ఎన్నుకున్న తరువాత నాలుగు రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మజ్లిస్, వై.ఎస్.ఆర్.సి.పీ ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. తెలుగుదేశం, బీజీపీలు పొత్తు కుదర్చుకున్నాయి. కాగా, నాలుగు శాతం స్థానాలను బీసీలకు కేటాయించారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత నగరానికి మొదటిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీలన్నీ వీటిని పట్టుదలగా తీసుకుoటున్నాయి.

Send a Comment

Your email address will not be published.