ఫోర్బెస్ జాబితాలో టాలీవుడ్ స్టార్లు

Forbes2016 Tollywoodఫోర్బెస్ 2016 సెలెబ్రిటీ జాబితా తాజాగా వెలువడింది. తొలి వంద మందిలో మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ తదితరులు చోటుచేసుకున్నారు.

గత ఏడాది 36వ ర్యాంక్ లో ఉన్న మహేష్ బాబు ఈ సారి మూడు స్థానాలు పైకెదిగి 33 వ స్థానంలో నిలిచారు. మరోవైపు ఆయన పేరుప్రఖ్యాతులు 78 నుంచి నాలుగు స్థానాలు పైకి ఎదిగింది. అంటే ప్రస్తుతం ఆయన పేరుప్రఖ్యాతుల జాబితాలో 74 వ స్థానంలో ఉన్నారు.

అయితే అల్లు అర్జున్ 42 వ స్థానం నుంచి 43 వ స్థానానికి దిగారు. ఫేం లిస్టు లో అల్లు అర్జున్ 67 వ స్థానం నుంచి 59 వ స్థానానికి ఎదిగినా ఫోర్బెస్ జాబితాలో మాత్రం ఒక స్థానం కిందికి తగ్గారు అల్లు అర్జున్.

జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ ఈసారి జాబితాలో కొత్తగా చేరారు. జూనియర్ ఎన్టీఆర్ 55 వ స్థానంలోను, రాం చరణ్ 67 వ స్థానంలోను ఉన్నారు. ఫేం లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ 89 వ స్థానంలోను, రాం చరణ్ 86 వ స్థానంలోను ఉన్నారు.

మహిళల విషయానికి వస్తే శృతి హాసన్, కాజల్ అగర్వాల్ లు ఈ ఫోర్బెస్ జాబితాలో చోటు సంపాదించగలిగారు. శృతి హాసన్ ఈ లిస్టులో 61 వ స్థానం నుంచి 46 వ స్థానానికి ఎగబాకారు. ఫేం లిస్టులో 47 వ స్థానం నుంచి 34 వ స్థానానికి చేరుకున్నారు. 2015 లో 58 వ స్థానంలో నిలిచిన కాజల్ ఈసారి 53 వ స్థానానికి చేరారు. ఫేం లిస్టులో ఆమె 45 వ స్థానం నుంచి 37 వ స్థానానికి చేరుకున్నారు.

Send a Comment

Your email address will not be published.