బహుళ సంస్కృతీ సాంప్రదాయంలో భారతావనికి పట్టం

బహుళ సంస్కృతీ సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్న ఆస్ట్రేలియా దేశంలో భగవద్గీత పుస్తకాన్ని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ కి పవిత్రమైన మన భగవద్గీత గ్రంధాన్ని కానుకగా అందివ్వడం భారతావనికి మరియు భారత ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమం గతవారం న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ హౌస్ లో గ్లోబల్ ఉమెన్స్ నెట్వర్క్ అధినేత శ్రీమతి అరుణ చంద్రాల గారి అధ్వర్యంలో కనుల పండుగగా జరగడం ఎంతో ముదావహం.

ఈ కార్యక్రమానికి న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ తరఫున శ్రీ విక్టర్ డోమినేల్లో, మినిస్టర్ ఫర్ అబోరిజినల్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఫర్ సిటిజెన్ షిప్ అండ్ కమ్యూనిటీస్, ఎంతో మంది న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ సభ్యులు, భారత హై కమీషనర్ శ్రీ అరుణ్ కుమార్ గోఎల్ మరియు భారతీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యానిస్తూ ఆస్ట్రేలియా బహుళ సంస్కృతీ విధానానికి కట్టుబడి ఉంటుందని ఇందులో భారతీయులకు ప్రత్యేక మైన గౌరవం ఉంటుందని వక్కాణించారు.

1 Comment

  1. My dear Brothers and sisters of Australia
    Andariki Namaskaram. News letter is very interesting. While reading it I felt I am in Australia. Keep continuing. I can also contribute some articles on family relations if you feel it is necessary
    regards

    Pattabhiram

Send a Comment

Your email address will not be published.