బావ మీద కోపంగా ఉంది

బావ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయిన బావ మీద కోపంగా ఉంది…ఈ మాటలు ఎవరివో కావు.

ఫైటర్, క్యారెక్టర్ యాక్టర్, హీరో శ్రీహరి భార్య శాంతి మనసులోని మాటలవి.

బ్రహ్మనాయుడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన శ్రీహరి హీరోగా నటించిన తొలి సినిమా పోలీస్ .శ్రీహరి మొత్తం 97 సినిమాల్లో నటించారు. వీటిలో 27 సినిమాల్లో హీరోగా నటించారు.

1964 ఆగస్ట్ 15న హైదరాబాద్ లోని బాలానగర్ లో పుట్టిన శ్రీహరి అనారోగ్యంతో ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2013 అక్టోబర్ 9న కన్నుమూసారు.

శ్రీహరి దంపతులకు ఇద్దురు కుమారులు. పెద్దవాడికి 17 ఏళ్ళు.

శ్రీహరి మరణించిన అయిదు నెలల తర్వాత ఆయన భార్య శాంతి తొలిసారిగా ఒక టీవీ చానల్ తో మనసు విప్పి అనేక విషయాలు పంచుకున్నారు. ఒకటి రెండు సందర్భాలలో ఆమె నోట మాటలు రాక కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆమె మాటల్లోనే ఇది చదవండి…

47 ఏళ్ళకే బావను నా నుంచి దూరం చేసి దేవుడు మాకు అన్యాయం చేసాడు. బావ ఉన్నప్పుడు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇల్లు నిర్మానుష్యంగా మారింది. బావకు జనంలో జనంతోపాటు ఉండటం ఎంతో ఇష్టం. రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు సేవ చెయ్యాలన్నది బావ ఆశయం.  కానీ అది నెరవేరకుండానే బావ వెళ్ళిపోయాడు. నెరవేరని బావ కోరిక తీర్చడానికి నేను రాజకీయాలలోకి వస్తాను. ఎవరు మంచి వారో ఆలోచించి ఆ పార్టీలోకి అడుగుపెడతాను…..అక్షయ ఫౌండేషన్ ద్వారా బావ కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి పాటుపడ్డారు.

బావకు ఇష్టమైనవి చేసి రోజు మూడు పూటలా  బావ ఫోటో దగ్గర పెడుతున్నాను.

బావకు ఊతప్పం, ఇడ్లీ అంటే చాలా ఇష్టం.

ఇంట్లో డాక్టర్, లాయర్ లను చూసుకోవాలన్నది నా ఆశ. కానీ పెద్ద కొడుక్కి డైరెక్టర్ అవాలని, చిన్న వాడికి యాక్టర్ అవాలని కోరిక. కానీ నేను వాళ్ళ ఇద్దరికీ చెప్పేదొక్కటే. ముందుగా బాగా చదవుకోవాలి. ఇప్పుడనుకున్నవి జరగకపోతే కనీసం ఉద్యోగాలైనా చేసుకుని జీవితాలు సాగించవచ్చు…..అని.

ఇలా అనేక విషయాలను ఆమె చెప్పుకొచ్చారు.

Send a Comment

Your email address will not be published.