బిల్, మిలిండా లకు పద్మభూషణ్

భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించిన “పద్మ” అవార్డుల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు, లోకోపకారులు, సంఘసేవకులు శ్రీమతి మిలండా మరియు బిల్ గేట్స్ వుండటం విశేషం.  వీరు ప్రపంచమంతా తమ సంఘసేవలను అందించడమే కాకుండా భారత దేశంలోనూ బీద ప్రజలకు, రోగనివారణ కార్యక్రమాలకు, విద్యా ఆరోగ్యం  ఇంకా మరెన్నో ఇతర సేవలకు ఈ అవార్డును ప్రకటించింది.

అమితాబ్ బచన్ కు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాష్ సింగ్ బాదల్ మరియు ప్రముఖ హిందీ చలన చిత్ర నటులు శ్రీ దిలీప్ కుమార్ లకు పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించారు.

ఎన్ ఆర్ ఐ కోటలో ఈ సంవత్సరం అనేక మంది ప్రముఖులకు పద్మశ్రీ లు ప్రకటించడం ముదావహం. వీరిలో అమెరికాలోని తెలుగువారు డాక్టర్ దత్తాత్రేయ నోరి మరియు రఘురాం పిల్లరిసేట్టిలు వున్నారు.

Send a Comment

Your email address will not be published.