బ్రిస్బేన్ కి శివారెడ్డి

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మరియు సినీ నటుడు శ్రీ శివారెడ్డి క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం దీపావళి సంబరాలకు ఈ నెల 23వ తేదీన ముఖ్య అతిధిగా  బ్రిస్బేన్ వస్తున్నారు.

శ్రీ శివారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా రామగుండములో పుట్టారు.  బడిలో చదువుతున్నప్పుడు నుండే వారు బడి పంతుల్లను, హెడ్ మాస్టర్ ను అనుకరించడం మరియు రంగస్థలం పై సినిమా నటులను అనుకరించి అందరి మెప్పు పొందారు.  చిన్న చిన్న స్కిట్స్ తనే తయారుచేయడం వాటిని బడిలో ప్రదర్శించటంతో అందరికీ ఒక హాస్య బ్రహ్మగా చిరపరిచితుదయ్యారు.

10వ తరగతి పూర్తి చేసిన తరువాత మద్రాసు (చెన్నై) నగరంలో సినిమా పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి వెళ్లారు.  అయితే అక్కడ అందరూ ‘నీవు చిన్నవాడవు, ఇంకొన్నాళ్ళు వేచి వుండాలని’ చెప్పడంతో శ్రీ శివారెడ్డి తిరిగి వరంగల్ రావడం జరిగింది.

శ్రీ నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర గారు దూరదర్సన్ లో అవకాసం ఇవ్వడంతో శివారెడ్డి దశ తిరిగిపోయింది.  సినిమా రంగంలో ‘పిట్టల దోర’ తో 1994 లో మొదలైన ప్రహసనం ‘ఆనందం’, ‘అమ్మాయి కోసం’, ‘వసంతం’, ‘అతడే ఒక సైన్యం’, ‘అడవి రాముడు’, ‘రంభ నీకు ఊర్వసి నాకు’ మొదలైన చిత్రాల్లో నటించారు.

అవార్డులు

వంశీ బర్కేలీ – అతడే ఒక సైన్యం

భారత ముని – అమ్మాయి కోసం

వీటితో పాటు రేలంగి అవార్డ్ మరియు యువతరంగ్ అవార్డులు కూడా గెలుచుకున్నారు.

 

Send a Comment

Your email address will not be published.