బ్రిస్బేన్ లో "నాదోపాసన"

carnatic music-Qld2“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:” అని ఆర్యోక్తి. ఆంటే శిశువులు పశువులతో పాటు పాములు కూడ గానరసాన్నివిని ఆనందిస్తాయని అర్థం. మీరాబాయి గానాలాపనను వినాలని అక్భర్ చక్రవర్తి మారువేషంలో వచ్చేవాడట. శ్రీకృష్ణుడి వేణుగాననికి గోపికలుగోవులతోపాటు మునులు కూడ తన్మయత్వం పొందెవారని చెబుతారు. సంగీతమాధుర్యం యొక్క మహత్తర శక్తి అంటేనే అది.

బ్రిస్బన్ నగరంలో 24 సెప్టెంబర్ 2016 నాడు శ్రీమతి సుస్మిత రవి గారు తన యొక్క స్వరాలయ స్కూల్ అఫ్ మ్యూజిక్ ఆద్వర్యంలో విద్యర్థులతో కలిసి “నాదోపాసన” అనే ఒక చక్కనైన కర్ణాటిక సంగీతోత్సవాన్ని క్వీన్స్ లాండ్
మల్టికల్చరల్ సెంటర్లో నిర్వహించారు. వాయిద్య కళాకారులతోపాటు 30 మందికలిపి ఈ కచేరి నిర్వహించారు.

carnatic music-Qld1వీనులవిందైన చక్కటి శాస్త్రీయ సంగీతంతోపాటు పంటికి పసందైన భోజనం అందించారు. కచేరి అద్యంతం శ్రోతలకు అలౌకిక అనందం అందించిందంటే అతిశయోక్తి కాదేమో. ఆస్ర్టేలియాలో మన శాస్త్రీయ కర్ణాటిక సాంప్రదాయన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పరిశ్రమించుచున్న పిల్లల, వారి తల్లిదండ్రుల మరియు గురువుల కృషి అభినందనీయం. సాంప్రదాయ వాయిద్యాలతో పాటు పాశ్చత్యవాయిద్యాలను వాడడం ఇందులో విశేషం.

ఈకచేరిలో అశ్విన్ వైద్యనాతన్-వయొలిన్, బ్రుంత సుందరం-వెస్ట్రన్ వయొలిన్, మురళి రామక్రిష్ణ-పిల్లన గ్రోవి, కుష్ సామి-డ్రమంస్, డా. కిరణ్ వర్మ-మృదంగం, పార్త్ రావల్- కీబొర్ద్, బర్త్ స్టెన్ హౌస్-గిటర్ సహకారం అందించారు. శ్రీమతి సుస్మిత రవి గారు గత 20 సంవత్సరాలుగా కర్ణాటిక సంగీత కళాకారిణిగా సేవలందిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.