భద్ర కాళికి స్వర్ణ కిరీటం

వరంగల్ నగరంలో ప్రఖ్యాత భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, ఇతర ఆభరణాలను సమకూర్చనున్నారు. వీటి విలువ అయిదు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకునేందుకు 11.7 కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ నిధులతో చేయించారు. దసరా సందర్బంగా కె సి ఆర్ దంపతులు ఈ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. స్వర్ణ కిరీటంతో పాటు, భుజకీర్తులు, కడియాలు కూడా అందజేస్తారు.

Send a Comment

Your email address will not be published.