భారతదేశ రూపాయి చరిత్ర

షుమారు క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో చలామణికై నాణేలను వాడినట్లు తెలుస్తుంది. “రుపియా” అన్న మాట ద్రావిడ భాషలోని “రుప” అన్న మాట నుండి వచ్చిందంటారు. “రప” అంటే వెండితో తయారైన నాణెమని అర్ధం. కానీ, “రూప” అన్నమాట సంస్కృతం నుండి వచ్చిన్దనటానికి ఆధారాలున్నాయి. “రూప” అన్నమాట ఋగ్వేదంలో ఉందట. “రూప” అంటే రూపం అన్న మాట. చాణిక్య కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యునికి ముఖ్య సలహాదారుడిగా ఉండేవాడు. ఇతను రచించిన అర్ధ శాస్త్రంలో వెండి నాణేలను “రూప్యరూప” అని, బంగారు నాణేలను “స్వర్ణ రూప్య” అని రాగి నాణేలను “తామ్ర రూప్య“ అని పేర్కొన్నాడు. “రూప” అంటే రూపకం లేక ఆకారం అని అర్ధం. మొగల్ చక్రవర్తి బాబర్ మరణానంతరం ఆతని కుమారుడు హుమాయూన్ ను తరిమివేసి ఆతని సేనాపతి పేర్షా సూరి 1540 లో చక్రవర్తి అయ్యాడు. ఈతడు గొప్ప సైన్యాదిపతే గాక చాలా చాకచక్యమైన పరిపాలకుడు కూడా. ఈతడు అనేక సంస్కరణలు తీసుకువచ్చాడు. అందులోఒకటి వెండి నాణేన్ని వాడుకలోకి తీసుకురావడం. దానికి రూపియా అని పేరు పెట్టాడు. అప్పట్లో దీని బరువు 178 గ్రైన్లు. 1 గ్రాము అంటే 15.43 గ్రాములు. ఈ వెండి రూపియా పేర్షా పాలనలోనే కాక తరువాత మొగల్, మహారాష్ట్ర, బ్రిటిష్ పరిపాలనలోను వాడుకలో వుంది. ఈ రూపియా కాగితం రూపంలో 1770 నుండి ప్రారంభమైనది. భారతదేశం రూపాయి, 19వ శతాబ్దంలో చాలాకాలం వెండి నాణెంగానే వుండేది. బ్రిటిష్ పరిపాలనలోను, దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనూ రూపాయిని 16 అణాలుగాను, ఒక అణాను 12 పైసలగాను విభజించారు. 1957 లో దేశమంతా డెసిమల్ కరెన్సీ అమలు చేసినప్పుడు ఒక రూపాయను 100 పైసలుగా విభజించారు. కొద్ది సంవత్సరాల తరువాత ‘నయా’ అన్న మాటను తొలగించి రూపాయకు నూరు పైసలన్నారు. ఇప్పుడు రూపాయకు ఒక క్రొత్త చిహ్నం వచ్చింది. ఇది దేవనాగరి “ర” రోమన్ R ల కలయికతో ఏర్పడింది. ఇలా దేశ ద్రవ్యానికి ప్రత్యెక గుర్తింపు ఉన్నవి బ్రిటిష్ పౌండ్, అమెరికన్ డాలర్, యూరోపియన్ యూరో ఇప్పుడు ఇండియన్ రుపీ. రూపాయకు ఈ చిహ్నం ప్రపంచమంతా వాడుకలోనికి వస్తుంది.

దూర్వాసుల మూర్తి, సిడ్నీ

Send a Comment

Your email address will not be published.