భారీగా పారిశ్రామిక రాయితీలు

కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, తెలంగాణాకు కూడా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలు ప్రకటించింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పడడానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందా  అని చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతగానో ఊరట కలిగించింది. రాష్ట్ర విభజన సందర్భంగా నవ్యాంధ్ర ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ఒక చిన్న అడుగు ముందుకు వేసింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తొలి ఏడాది రెవిన్యూ లోటు భర్తీ వంటి అంశాలను పక్కన పెట్టి, ప్రస్తుతానికి వెనుకబడిన ప్రాంతాలయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ. 350 కోట్ల రాయితీలు ప్రకటించింది. అలాగే, రాష్ట్రానికి మరో రూ. 500 కోట్ల ఆర్ధిక మద్దతు ప్రకటించింది. ఇది మొదటి విడత మాత్రమేనని కేంద్రం ప్రకటించింది.  ప్రత్యేక రాయితీలు, హోదా, వెసులుబాట్ల విషయంలో రాష్ట్ర వాదనను పరిశీలించి సాధ్యమయినంత త్వరగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం నియమించిన  మంత్రుల కమిటీ ఈ తాత్కాలిక రాయితీలను ప్రకటించింది.

Send a Comment

Your email address will not be published.