భారీ రామానుజ విగ్రహం

Ramanujacharya JETహైద్రాబాద్ నగరంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో 216 అడుగుల భారీ రామానుజాచార్య విగ్రహం నెలకొల్పాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి సంకల్పించారు. ఇది పంచలోహ విగ్రహం. ఆసియాలోనే ఇంత పెద్ద విగ్రహం లేదని చినజీయర్ చెప్పారు. వచ్ఛే ఏడాది రామానుజాచార్య సహస్ర జయంతి వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని కూడా ఆయన తెలిపారు. ఆ సమయంలోనే ఈ సమతా మూర్తి విగ్రహావిష్కరణ కూడా జరుగుతుందని ఆయన చెప్పారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రామానుజాచార్య సహస్ర జయంతిని పురస్కరించుకుని ఆయనపై ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ళను కూడా ముద్రించే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.