భాషే మూలం

తెలుగు సంఘం అని పేరు పెట్టుకొన్నాం కాబట్టి తెలుగు భాషే మూలం, మరియు తెలుగు భాషే మనందరికీ పాశం అంటున్నారు క్రొత్తగా ఆస్ట్రేలియా తెలుగు సంఘానికి ఎన్నికైన శ్రీని కట్ట గారు. గత కొంత కాలంగా ఎన్నో కార్యవర్గాలు మెల్బోర్న్ తెలుగు సంఘం పగ్గాలు చేపట్టినా భాషా ప్రాతిపదికగా ముందుకెళ్ళాలన్న ఆకాంక్షను వ్యక్తపరచిన కార్యవర్గం ఇదేనని చెప్పొచ్చు. తెలుగు వారి అభ్యుదయానికి తోడ్పడే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సభ్యులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక స్థలం అద్దెకైనా సరే మనకంటూ ఒకటి ఉండాలని దానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షులు శ్రీ శ్రీని కట్ట గారు తెలిపారు. ఈ క్రొత్త కార్యవర్గంలో అందరూ క్రొత్త వారిని తీసుకొని తమ పదునైన ఆలోచనా సరళితో సరిక్రొత్త కార్యక్రమాలు చేపట్టి వచ్చే ఉగాదికి ఆస్ట్రేలియాలో ప్రపంచ మహాసభలు నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్నట్లు శ్రీని గారు చెప్పారు.
TAAI
నూతన కార్యవర్గం:
అధ్యక్షులు: శ్రీని కట్ట
ఉపాధ్యక్షులు: డా. సుభాష్ చల్ల
కార్యదర్శి: శ్రీనివాస్ గుళ్ళపల్లి
సభ్యులు 1 – ప్రియాంక మార్గాని
సభ్యులు 2 – అశ్వని ఉస్తాలే
సభ్యులు 3 – శ్రీధర్ తుమ్మలపల్లి
సభ్యులు 4 – కృష్ణ శేష్

కార్యవర్గంలో ఖాళీగా వున్న కార్యవర్గ పదవులు చేపట్టడానికి మరికొంతమంది త్వరలో చేరనున్నారు.

2016 – 17 సంవత్సరానికి తెలుగు సంఘం ఏర్పడి 25 ఏళ్ళు నిండింది. ఆస్ట్రేలియాలో మొదటిసారిగా రజితోత్సవాన్ని జరుపుకున్న తెలుగు సంఘం మనదే. ఒక సంఘం చరిత్రలో 25 ఏళ్ళు అంటే గర్వించదగ్గ మైలు రాయి. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన కార్యవర్గ అధ్యక్షులు శ్రీ రామారావు మునుగంటి మాట్లాడుతూ శ్రీ దేవేశ్రీ ప్రసాద్ సంగీత నృత్య కార్యక్రమాన్ని మెల్బోర్న్ కన్వెన్షన్ హాలులో మొదటిసారిగా నిర్వహించడం తెలుగు సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్రానికి తీసుకెల్లడమేనని అభివర్ణించారు. క్రొత్తగా తాయి ఫౌండేషన్ ని మొదలుపెడుతున్నట్లు చెప్పారు. దీని ముఖ్యోద్దేశ్యం క్రొత్తగా భారతదేశం నుండి వచ్చిన తెలుగువారికి మరియు ఇక్కడ వృద్ధాప్యంలో వున్న సభ్యులకు సహాయం చేయడం అని శ్రీ రామారావు గారు చెప్పారు. పదవీ విరమణ చేసిన తమ కార్యవర్గ సభ్యులతో పాటు అడ్వైసరీ బోర్డు సభ్యులు శ్రీమతి అనురాధ మునుగంటి మరియు శ్రీ వెంకట్ దొడ్డి గార్లను వారి సేవానిరతిని ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

క్రొత్త అడ్వైసరీ బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ గంగుల మరియు శ్రీ హరి శ్రీనివాస్ పదవీ బాధ్యతలను చేపట్టారు.

Send a Comment

Your email address will not be published.