భువన విజయ పంచ వర్ష ప్రాయం

భువన విజయం – మెల్బోర్న్ సాహితీ సంవేదిక ఐదేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా భువనవిజయ రధసారధి సాహితీ సంచారి శ్రీ ఎస్పీ చారి గారి సమక్షంలో సాహితీ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భువన విజయ కవి పుంగవులు వ్రాసిన కొన్ని పద్యాలు, పాటలు, కవితలు  ఇక్కడ ప్రచురిస్తున్నాము.

మహాకవి కాళిదాసు తన “మేఘ సందేశం” లోని శ్లోకాలు మందాక్రాంత వృత్త మాలికలో వ్రాసారు. మా భువన విజయ సభ్యులు మా అందరికీ పెద్దనామాత్యులతో సమానులైనటువంటి శ్రీ సరిపల్లె సూర్యనారాయణ గారు భువన విజయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా “మందాక్రాంత వృత్త మాలిక” లో వ్రాసిన పద్యం.

ఐదేండ్లయ్యెన్ భువన విజయ మ్మాస్త్ర లేయావనంతన్
తాదుర్గమ్ముల్ గెలిచివెలుగొందంగజేసెన్తెనుంగున్
ప్రాదుర్భావానపురుషవరాప్రాపునిర్దేశమందెన్
ధీధార్ఢ్యంబుల్పొదిగినడుపన్ధీరుడౌమల్లికేశం
వేదారుల్తీరులగుకవిరాడ్విజ్ఞతాకల్పవల్లై
పాదైపొందౌరచనవచనప్రాభవాలంకృతమ్మై
దేదీప్యంబైతెలుగువెలుగుల్దిగ్దిగంతమ్మునిండన్
శ్రీదంబౌనక్షరపదదశన్జేరెవాణీకృపన్తా
………. సూర్యనారాయణ

—————————————————————————————

గురువులు శ్రీ యస్ పి చారి గారికి:
భువనవిజయ గణ భావేశాగ్ని ప్రేరణం కర్తవ్య ప్రభావితం
సాహితీ చతురత్వం పదనిర్ధేశకత్వం పధ్యోత్సాహ మార్గం
సంస్కృతీ సంప్రదాయాల పరి పూర్ణ వ్యక్తిత్వ వికాసం
భాషాతేజం అత్యంత ఆప్తం గురుశ్రీ శేషం పురుషోత్తమం

గురువుల ఆశీర్వాదం శిష్యులపై శుభాల వర్షం
కలకాలం తోడవ్వాలి అక్షరసుమాల అనుగ్రహం
తెల్లకోటలో తెలుగోళ్ళతో ఆరంభించాడు భువనవిజయ సాహితీ బృందం
డూడూ బసవన్నా పెద్దయ్యకు పెట్టు అందరి తరఫున గణగణగంటల దండం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
తెలుగు మల్లి మల్లిక్ సౌరభానికి:
కాల్వగట్టున సాహిత్యమే జపము తపము యాగము కొంచాడకు
వర్ణమాల చెరకు పండించి తీపిని పంచే రైతుబిడ్డ కవి మిత్రులకు
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీమతి షర్మిలా అజీత్ గారు:
అందరినీ అలరించే శర్మిలాఅజిత్ కలమెరుగదు పండిత పామర భేదం
సరసస్వర ఝరీ గమనంలా సాగే కదలే సాహిత్యానికి వన్నెల వైనం

శ్రీ భాస్కర రావు సరిపల్లె గారు:
సాహిత్య ప్రతిభా జీవన వ్యక్తిత్వాల అక్షరసమామ్నాయం సాహితీ సరిపల్లె
ప్రాచీన హోదా భాషాశాస్త్ర పద్య విశిష్టతల మిడిసిపడింది భువనవిజయ రేపల్లె
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ రఘు విస్సం రాజు గారు:
సంగీత సాహిత్య కళా ప్రేమి అక్షరశిల్పి ఈ సాహితీ రారాజు
రాగ తాళ శాస్త్రీయ ప్రయోగ స్వరశిల్పి రఘు విస్సం రాజు
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం గారు:
గుండె లోతుల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చే భావం అద్భుత సాహిత్యం
అవగతం చేసుకుని ఆలపించిన కమ్మని గాత్రం వేణు రాజుపాలెం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ రాంప్రకాష్ ఎర్రమిల్లి గారు:
ఓ సున్నిత పరిశీలన సారూప్యమైన వర్ణన
రాంప్రకాష్ యర్రమిల్లి గారి ఘంటా స్పందన
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
రమణీయ పద తోరణాల పద్య బ్రహ్మ సరిపల్లె సూర్యనారాయణ:
వేంకట కవులకొక్కళ్ళకే చెల్లునా అవధానం
పద్యగానామృతం సరిపల్లె వారి అక్షర క్రమం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ సుధీర్ మాండలిక గారు:
కవితల్లో కల్పనలు కల్పనతో కవితలు
ఆ ప్రేమ కలపు చిటపట చినుకులు
చిలికే మన్మథ మంత్రాల అక్షరాలు
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ చారి ముడుంబి గారు:
గత వైభవాలను వర్తమానంలో స్ఫురింపజేసే చారి ముడుంబి గారి గళం
గానంలో తనదైన శైలి పరిచయం పండిస్తుంది చక్కటి పద మాధుర్యం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ యోగి వాల్తాటి గారు:
కుర్రో కుర్రు, కొండ దేవర పలుకుతాండు, ఉన్నదున్నట్టు సెబుతాండు..
ఎక్కడో ఎందుకు జూస్తవ్, ఓ సారి అటుకెల్ల సూస్కో మస్కా తెల్ల పోరుంది..
జర్ర నిన్ను పక్కకి రమ్మంటుంది, రథసప్తమిని రససప్తమి చేస్తనంటుంది
ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అని బాదపడే యోగినే కావాలంటుంది
ఇలా వ్రాసే మాండలీకాల మర్మయోగి అక్కో నీ బాంచను మాంత్రీకుడు యోగి
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
శ్రీ ఉమామహేశ్ సెనగవరపు గారు:
ఎల్లలు దాటిన మెల్బోర్న్ తెలుగువారికి తోడైన తెలుగు సంబరం
అభినయ చిన్నెల సంస్కృత వన్నెల తేజం మా ఉమామహేశ్వరం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మన తెలుగు తల్లికే మల్లె పూదండ
తెలుగు వారిగా ఆస్ట్రేలియాలో మాత్రం మనమే ఒకరికొకరం అండ”
–శ్రీ మురళి ధర్మపురి

—————————————————————————————
భువనవిజయి పంచ వర్ష కన్య

ఆంధ్రావని జన్మనిచ్చి పెంచిన బిడ్డలము మేము
ఆస్ట్రేలియా మాత యొడి జేరితిమి
అనురాగాభిమానము లకు లోటు లేదు
అందని కన్నతల్లి తీయని పలుకు తక్క .
సోకుట లేదు వీనుల అందమైన అమ్మాయను పిలుపు
తాకగ లేదు నటుల పిలిచి పిలిపించుకొ ను భాగ్యము .

మేమన్న దమ్ములము పదిమంది
సోదరి యొకతె , అందరము కలిసి
స్నేహ సౌహా ర్ద్రముల మెలగుచు
మా తల్లి భాషను నెమరు వేయుచు
నిరంతర సాహితీ వ్యవసాయము నకు ద్యుక్తుల మైతిమి ,
అన్యధా మనఃశాంతికి మార్గము లేదని ధృడ నిశ్చయు లమై .

మేజేసిన యొక మంచి పని యేమన
ఇచటకు తరలి వచ్చు నపుడు
శారద మాత ప్రతిమ నొక్కటి తెచ్చుకొని
ఆ జ్ఞానస్వరూపిణి నారాధించుచు నుంటిమి .

ఏకాగ్రత నేకలవ్య దీక్ష నవలంభించితిమి
మాలోని బాల శారద దిన దిన ప్రవర్ధ మనమగుచు
మా పున్నెముల పంట యనగ
కలకలలాడుచు ,మా వాకిట యాడుచు పాడుచు

దర్శన మిచ్చె నేడు పంచవర్ష కన్యక
శోభాయమాన ,నేత్ర పర్వమై
విజయిభువనేశ్వరి శారద భువనగ భువినవతరిన్చెన్ .

–భాస్కర రావు సరిపల్లె
—————————————————————————————

భువన విజయ పంచమ వార్షికం
దుష్ట గుణ నాశినీ! శిష్ట గుణ రక్షినీ! మహిషాసుర మర్ధినీ!
దశావతారీ! శ్రీనృసింహ మురారీ! ఆశ్రిత భయ నివారీ!
సర్వశక్తి సమన్వయీ! సర్వాధారీ! సర్వహిత కారీ! శ్రీసాయి శ్రీకరీ!
సృజనాత్మక శక్తివి నీవే! కవుల కల్పనలో నీవే! మమ్మేలే జననివి నీవే!
తలచిన కార్యముల నీడేర్పవే! కోరిన కోర్కెల సిద్ధ మొనర్పవే!

చిలుకలు పలికే స్వాగతమా! పలుకగ నేర్చిన రామమంత్రమా! సిద్ధిని పొందగ చిన్నిప్రయత్నమా!
బాల కృష్ణుని బుడత నడకయో! యశోదమ్మతల్లి గాఢ సంబరమో! గంధర్వుల వీధి గానాలాపమో!
చిన్నిపొన్ని చిరుతల చిరుచిరు పలుకులే! వన్నెలు తరుగని వింతచేష్టలే !
కాలమే తెలియని కంటివెలుగులే!
ఏది ఏమనగ ఏమి తోచెనో ! తోచ లేదనగ లేదు ఉందనో!
ఉంది లేదనగ రాదు కవితయో! కవిత వ్రాయుటకే కలము పట్టేనో!
హరిఓం హరిఓం నామోఛ్ఛరణము ! శంభో శంభో యను వేడు కొల్పులు!
వేదమంత్ర పఠన పూజార్పితములు!
శ్రీహరి పూరించిన శంఖారావo! అర్జును కొసగిన గీతొపదేశo! శాంతికాముకుల రక్షణకవచo!
సాంబశివుని మెడ బుస్సుబుస్సులు! చిన్నికృష్ణుకెంత కాళియ ధూర్తము! భక్తుల పాలిటి కల్పవృక్షము!
కవివరు మనసున ఊహలు పుట్టెడు! కవితాస్త్రాలయ కవుల వేడుకలు!
కనివిని యెరుగని కాంతుల సోనలు!

మనసున పుట్టే యలజడులు! దాటిన తెలియుగ తత్వార్ధములు! మానవ జీవిత పరమార్ధములు!
సమచిత్తంబన సమదృష్టం ! సమదృష్టింగను నాత్మభవున్! జీవన్ముక్తి కదే చరమస్థానం!
–రాంప్రకాష్ ఎర్రమిల్లి

—————————————————————————————

 

2 Comments

  1. మాతృభాష మమకారవల్లి తెలుగుమల్లి
    నవవ్యాకరణ గుడికట్టె ఈసుమగీతమల్లి
    మదిమందిర ప్రేరిత విరచిత మధుగీతం
    అనందభరితం మధుర కవి మల్లికేశ్వరా

  2. మాతృభాష మమకారవల్లి తెలుగుమల్లి
    అనందభరితం మధుర కవి మల్లికేశ్వరా

Send a Comment

Your email address will not be published.