మంగళయానం మంగళప్రదం

అద్భుతం… మహాద్భుతం… అంతుపట్టని రహస్యాల అంతరిక్షంలో అరుణ వర్ణంలో మెరిసే అంగారక లేదా కుజ గ్రహాన్ని భారత్ చేరుకుంది. అంతరిక్షంలో అద్భుతం సాధించింది. కుజగ్రహంపై జీవం ఉనికికి ఆనవాళ్ళు అయిన సంకేతాల అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన 78 కోట్ల కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర విజయవంతం అయింది. 323 రోజుల్లో ఈ దూరాన్ని అధిగమించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ‘మామ్’ గత బుధవారం ఉదయం కుజుడి కక్ష్యలోకి ప్రవేశించి, చరిత్ర సృష్టించింది. భూ ప్రభావ క్షేత్రాన్ని అధిగమించి, ఖగోళంలోని మరో గ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని, భారత్ జరిపిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం ఇది. ఈ విజయంతో….. తొలి ప్రయత్నంలోనే మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపిన దేశంగా భారత్ సగర్వంగా నిలిచింది.

అంగారకుడి కక్ష్యలోకి ఆర్బిటర్ ను పంపిన తొలి ఆసియా దేశంగాను ఘనత సాధించింది. ఇప్పటికే అంగారకుడి దిశగా ఆర్బిటర్లను పంపి విజయం సాధించిన అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ల సరసన భారత్ నాలుగో దేశంగా నిలిచింది. “మన దేశ క్రికెట్ జట్టు సాధించిన విజయానికన్నా మంగళ యాన్ విజయం వెయ్యి రెట్లు గొప్పది. దేశ వ్యాప్తంగా పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది” అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నాసా కూడా దీన్ని అభినందించింది.

Send a Comment

Your email address will not be published.