మణిరత్నంతో సినిమా

సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం ఒక తెలుగు చిత్రం చేస్తున్నట్లు టాలీవుడ్ లో కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే అవి షికార్లు కావని నిజమేనని హీరో నాగార్జున స్పష్టం చేసారు. ఒక పత్రికతో మాట్లాడుతూ తన కెరీర్లో  ఓ పెద్ద సవాల్ కు సిద్ధమవుతున్నానని నాగార్జున చెప్పారు. మణి రత్నం, మహేష్ బాబులతో కలిసి తాను ఒక సినిమా చేస్తున్నానని అన్నారు. తాను ప్రధాన పాత్ర పోషించబోతున్నానని చెప్తూ మణిరత్నం ఓ నలభై నిమిషాలు చిత్ర కథ సారాంశాన్ని చెప్పినప్పుడు తాను ఇంప్రెస్ అయ్యానని తెలిపారు.  మణిరత్నం  కథ చెప్పినప్పుడు తాను కన్విన్సు అయ్యానని చెప్పారు. నిజానికి మణిరత్నం గతంలో ఓ తెలుగు సినిమా నాతో చేసారని, అది గీతాంజలి అని అన్నారు. బహుశా తానిప్పుడు మణిరత్నం ను తెలుగు వైపు తీసుకొస్తున్నానని అన్నారు. పూర్తి వివరాలు ఇంకా వర్క్ అవుట్ చెయ్యాలని, అయితే అదో గొప్ప చిత్రమవుతుందని అంటూ మహేష్ బాబు, తాను కలిసి నటించే తొలి చిత్రమిదేనని నాగార్జున అన్నారు.  కనుక ప్రేక్షకులు తమ నుంచి కచ్చితంగా ఏదో ఒక నూతనత్వాన్ని ఆశిస్తారని తెలుసునని, వారి ఆశలు వమ్ము కావని చెప్పారు.
ప్రస్తుతం నా దృష్టి అంతా మా ఫ్యామిలీ చిత్రం మనం విడుదలపై ఉందని, మా నాన్న, నేను, నా కొడుకు ఈ చిత్రంలో నటించామని అన్నారు.

Send a Comment

Your email address will not be published.