మరుగుదొడ్ల కంటే మొబైల్స్ ఎక్కువ!

భారత దేశంలో మొత్తం మొబైల్ ఫోన్ల వాడకందార్ల సంఖ్యా 56.38 కోట్లు దాటింది. అంటే భారత దేశ 120 కోట్ల జనాభాలో దాదాపు సగం మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయన్న మాట. అయితే విచిత్రమేమిటంటే, మొత్తం జనాభాలో మూడవ వంతు మందికి, అంటే 36 కోట్ల మందికి 2008 నాటికి కూడా సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. ఐక్యరాజ్య సమితికి చెందినా ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సర్వేలో ఈ సంగతి వెల్లడయింది.

“నిజంగా ఇది విషాదకరం. సగానికి పైగా జనాభా వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయంటే భారత దేశం సంపన్న దేశం అయి ఉండాలి. కానీ కోట్లాది మందికి ఇప్పటికీ సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కనీస అవసరాలు కల్పించడంలో దేశం విఫలమయింది” అని ఈ విశ్వవిద్యాలయ డైరెక్టర్ జాఫర్ అదీల్ వ్యాఖ్యానించారు. కెనడాలోని హామిల్టన్ నగరంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ నీరు, పర్యావరణం, ఆరోగ్య విభాగానికి అదీల్ అధిపతి. “సరైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల అనేక జీవితాలు మెరుగుపడతాయి. ఆరోగ్యాలు మెరుగుపడతాయి. అయితే పేద దేశాలలో సైతం మొబైల్ ఫోన్ల వంటి చిన్న చిన్న ఆధునిక సౌకర్యాలపై పెట్టుబడులు పెరగడానికి కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడమే” అని ఆయన అన్నారు.

“పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేనందువల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదేళ్ళ లోపు పిల్లల్లో 45 లక్షల మంది గత మూడేళ్ళలో ఈ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు” అని ఈ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మించడానికి సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చవుతాయని, అయితే ప్రభుత్వాలు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని అదీల్ చెప్పారు.

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్ది శ్రీ నరేంద్ర మోడీ కొంత మంది యువకులతో మాట్లాడుతూ “తాను రాజీ కానీ హిందూ మత తత్వ పార్టీకి చెందిన వాడినైనా నాకు గుడి గోపురలకంటే మరుగు దొడ్లే ముఖ్యమని” పేర్కొన్నారు.

Send a Comment

Your email address will not be published.