మరో కొత్త పార్టీ!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు అయిన పాలెం శ్రీకాంత్ రెడ్డి తమ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నుంచి బయటకు రాగానే ఆయన తాను ‘జన పాలన’ పేరుతో ఒక సామాజిక రాజకీయ ఉద్యమ వేదికను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. దేశంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, దేశాన్ని డబ్బే పాలిస్తోందని, ఎన్నికలను శాసించేది కూడా డబ్బేనని ఆయన అన్నారు. ఈ దుస్థితి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, రాజకీయాలపై డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు తాను ఈ వేదికను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. తమ సంస్థకు ఇప్పటికే 12 జిల్లాలలో శాఖలు ఏర్పడ్డాయని, ఇక తాము ప్రతి జిల్లాకూ వెళ్లి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. త్వరలో అనంతపురం నుంచి తమ సదస్సులను ప్రారంభిస్తామని శ్రీకాంత్ తెలిపారు.

గతంలో ఆయన ‘యువ పథం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

Send a Comment

Your email address will not be published.