మళ్ళీ తెరపైకి రేవతి..?

ఒకప్పటి హీరోయిన్ రేవతి మళ్ళీ తెరపై కనిపించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ భోగట్టా.
రామ్ గోపాల్ వర్మ చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది.

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రేమ అనే చిత్రంలో వెంకటేష్ తోపాటు నటించిన రేవతి అలనాడు శ్రీదేవి, జయప్రద, జయసుధ తదితరులు కథానాయికలుగా నటించిన రోజుల్లో రేవతి కూడా అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించింది. అప్పట్లో తన కెరీర్ ముమ్మరంగా సాగుతున్నప్పుడే పెళ్లి చేసుకున్న రేవతి ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.

మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ కలిసి చేసే తదుపరి ప్రాజెక్ట్ లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవతి తెలిపారు. మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో ఆ మధ్య రౌడీ చిత్రం విడుదలైన సంగతి విదితమే. ఇప్పుడు వీరి ప్రాజెక్ట్ లో రేవతి ఏ పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఇంకొంత కాలం నిరీక్షించాలి.

Send a Comment

Your email address will not be published.