మహానాడు ప్రారంభం

రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు బుధవారం ప్రారంభం అయింది. హైదరాబాద్ నగరంలోని గండిపేటలో ప్రారంభం అయిన ఈ తెలుగుదేశం పార్టీ వార్షిక ఉత్సవానికి 40 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు అవుతున్నారు. ఈ సమావేశాలు మూడు రోజులపాటు జరుగుతాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు, పార్టీ బలోపేతానికి సంబంధించి అనేక అంశాలను ఇక్కడ చర్చిస్తారు. ముఖ్యంగా కొత్త రాజధానికి సంబంధించిన కార్యక్రమాల మీదా, తెలంగాణా రాష్ట్రంలో పార్టీకి దిశా నిర్దేశం చేయడం మీదా చర్చలు జరుపుతారు. నగరంలో ఎండా వేడిమి తీవ్రంగా ఉన్నందువల్ల సమావేశ స్థలంలో నాలుగు వేలకు పైగా కూలర్లు, నిరంతర మజ్జిగ సరఫరాలను ఏర్పాటు చేశారు. ఎన్టీ ఆర్ జయంతి సందర్భంగా ఈ మహానాడు ప్రతి ఏటా మే నెల 27న మొదలు అవుతాయి.

Send a Comment

Your email address will not be published.