మహారాష్ట్రతో నీటి ఒప్పందం

తెలంగాణా రాష్ట్రంలో అయిదు ప్రాంతాల్లో గోదావరి నది మీద ప్రాజెక్టులు నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణాలో సుమారు కోటి ఎకరాలకు సాగు నీరు లభిస్తుంది.
మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫద్నవీస్, తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ల మధ్య ఒప్పందంపై ముంబైలో సంతకాలు జరిగాయి. తెలంగాణాలోని మేదిగడ్డ, తుమ్మిదిహట్టి, రాజాపేట, చనఖ-కొరట, పంపరాద్ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు గోదావరి జిల్లాల స్థాయికి ఎదిగే అవకాశం ఉందని తెలంగాణా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అంతర్ రాష్ట్ర మండలి పర్యవేక్షిస్తుంది.
మహారాష్ట్ర-తెలంగాణా చరిత్రలో ఈ ఒప్పందాన్ని ఒక చారిత్రాత్మక అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. కరువు, కాటకాల కారణంగా అప్పుల బారిన పది ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఇక ఇక్కడి రైతులకు ఉండదని కూడా ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.