మహిళలపై ఖలీల్ జిబ్రాన్

దేవుడు మహిళలకు స్పందనను అందంగాను, దేహాన్ని నిజంగాను సృష్టించాడు. అదే సమయంలో ఆ అందమైన స్పందనను, దేహాన్ని బహిర్గతం చేశాడు. రహస్యంగానూ ఉంచాడు. వాటిని మనం ప్రేమతోనే గ్రహించి, తెలుసుకుని, అర్ధం చేసుకుని, మంచి నడవడితోనే స్పర్శించగలం. అటున్వంటి స్త్రీని మనం వర్ణించడానికి ప్రయత్నిస్తే ఆమె ఎండమావిలా దాగిపోతుంది.

స్త్రీలు నా కనుల బలహీనతను తెరచి ఆత్మలోని భావాల తలుపులను తెరిచారు. ఈ స్త్రీ అనే మా  అమ్మ స్త్రీ అనే సోదరి లేకుండా పోయి ఉంటే నేను ప్రపంచ మత్తులోనే నిద్రపోయి గురకలు పెట్టి ఉండేవాడిని. అందరి మనుషుల మధ్య నిద్రపోయి ఉండేవాడిని.

రచయితలు, కవులు స్త్రీల గురించి నిజాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు వరకు ఆమె హృదయాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యపడలేదు.అంతదాకా ఎందుకు, నాలో ఆమెను ఆశల తెరతో చూసేటప్పుడు వారికి వారి దేహరూపాన్ని తప్ప మరేదీ నా వల్లచూపించడం కుదరలేదు.

ఆమెను ద్వేషం అనే భూతద్దంతో చూస్తున్నారు. అప్పుడు వారికి కనిపించేదల్లా బలహీనత, బానిసత్వమే…

స్త్రీ హృదయం, మనసు, కాలానికి, ప్రాయానికి తగినట్టు మారాడు. ఆ మనసు అంతు లేనిదైనా అది ఎన్నడూ నశించదు.

స్త్రీ హృదయం ఒక పచ్చనిబయలు.

– ఈ మాటలు ప్రముఖ పర్షియన్ కవి ఖలీల్ జిబ్రాన్ వి.

– యామిజాల

Send a Comment

Your email address will not be published.