మహేష్ బాబు ప్రశంసలు..

సూపర్ స్టార్ ప్రిన్సు మహేష్ బాబు అక్కినేని అఖిల్ ను ప్రశంసించారు.
నాగార్జున సమర్పించి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న “మనం” సినిమా చూసిన తర్వాత ఆ చిత్రాన్ని పొగుడుతూ మహేష్ బాబు ఈ విధంగా చెప్పుకొచ్చారు…….
“ఏ ఎన్ ఆర్ జీవించే ఉన్నారు….అక్కినేని ఫ్యామిలికీ ఈ క్షణాలు మాటల్లో చెప్పలేనివి…ఇటువంటి ప్లాట్స్ విజయవంతమైనప్పుడు  నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. “మనం” యూనిట్ కు నా  కంగ్రాట్స్. ప్రత్యేకించి దర్శకుడు విక్రంకు . ఆయన ఆలోచన సుపర్బ్. సినిమా ముగింపులో ముగ్గురు అక్కినేనులతో (ఏ ఎన్ ఆర్, నాగార్జున, నాగచైతన్య) కనిపించిన అఖిల్ ను చూస్తుంటే అమేజింగ్ గా ఉంది. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది” అని.

Send a Comment

Your email address will not be published.