కాన్బెరా లో మాతృ భాషా దినోత్సవం

ఫిబ్రవరి 21 వ తేది ఆస్ట్రేలియా ముఖ్యపట్టణమైన కాన్బెర్రాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోని అన్ని భాషల ప్రజలు  అందరూ ఓ సమూహంగా చేరి  లాంగ్వేజ్ వాక్ ఎంతో ఘనంగా నిర్వహించి తమ తమ మాత్రు భాషలపై అభిమానాన్ని మరియు ఆయా  భాష మాధుర్యాలను తమ తమ మాట, పాట, కవితల ద్వారా అందరితో పంచుకొని ఆనందించారు. ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ అసోసియేషన్, మరియు ఇతర సంఘాలు (రష్యన్, చైనా, నైజీరియా, జపనీస్ మొదలగువారు ) కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన తెలుగు వారు, కాన్బెర్ర తెలుగు అసోసియేషన్ సుభ్యులు కృష్ణ నడింపల్లి , చిట్టిబాబు దివి, వంశి గోలగూరి, రుద్ర మరియు చిరంజీవి నందన్ లు ఈ నడకలో పాల్గొన్నారు. రుద్రగారు తెలుగు భాష ప్రాశస్త్యాన్ని గురించి వివరించి కొన్ని కవితలను వినిపించి ఆ అర్ధాలను అందరికే ఆంగ్లంలో వివరించారు..

Send a Comment

Your email address will not be published.