మానసికోద్వేగ అస్థిరత

Post Traumatic disorder (PTSD)  

అంటే?

కొంత మంది ఒక అపాయకరమైన సంఘటన చూసినా లేక వారే అనుభవించినా ఈ మానసికోద్వేగ అస్థిరతకి లోనౌతారు.  అపాయంలో వున్నప్పుడు భయపడడం చాలా సాధారణ విషయం.  ఈ భయం లిప్త కాలంలో శరీరంలోని కొన్ని అవయవాలను తనను తాను కాపాడుకోవడానికి కానీ ఆపద నుండి బయటపడడానికి గానీ సిద్ధం చేస్తుంది. దీన్నే ఆంగ్లంలో “fight-or-flight” స్పందన అంటారు.  ఇది ఆరోగ్యకరమైనదనే చెప్పొచ్చు.  అయితే ఉద్వేగ అస్థిరత ప్రక్రియలో ఈ పరిస్థితి మారవచ్చు.  చాలామంది ఒత్తిడికి లేక భయాందోళనలకు  గురవడం జరుగుతుంది.

ఈ అస్థిరత అనేది నిజమైన వ్యాధి.  దీనికి మూలం ప్రత్యక్షంగా యుద్దాన్ని వీక్షించడం, తీవ్రమైన తుఫాను చూడడం, ఒక దారుణమైన దుర్ఘటనను చూడడం ఏదైనా కావచ్చు.  ఈ అపాయకరమైన సంఘటనల తదుపరి ఒత్తిడికి గురవడం, భయాందోళన చెందడం జరుగుతుంది.  వీటివలన వారి జీవితానికే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నవారికి కూడా ప్రభావం చూపుతుంది.  ఈ వ్యాధి కుటుంబ సభ్యులు గానీ స్నేహితులు గానీ తీవ్రంగా గాయపడినా ఈ అస్థిరత ఏర్పడే అవకాశం వుంటుంది.

కారణాలేమిటి?

 • కుటుంబ సభ్యులు లేక అత్యంత ఆప్తుల మరణం
 • యుద్ధం లేక జగడము
 • ప్రాణాంతకమైన కారు లేక విమాన ప్రమాదాలు
 • తీవ్రతరమైన తుఫాను, సుడిగాలి లేక అగ్ని ప్రమాదం
 • దొంగతనము లేక కాల్చివేయడం వంటి క్రూరమైన దుష్కార్యము

పైనుదహరించినవే కాకుండా ఇంకా చాలా కారణాలుండవచ్చు.  ఈ పరిస్థితిలో మీ కుటుంబ వైద్యునితో సంప్రదిస్తే మంచిది.

ఎవరికి వర్తిస్తుంది?

వయసుతోనూ స్త్రీ పురుషులని లింగ బేధం లేకుండా ఈ అస్థిరత ఎవరికైనా రావచ్చు.  యుద్ధ యోధులు, అవాంతర పరిస్తితుల్లో లైంగిక వేధింపులకు గురైన వారు, శారీరకంగా దెబ్బలు తినడం, కొన్ని దుర్ఘటనలు చూసేవారు ఈ అస్థిరతకు గురయ్యే అవకాశం వుంది.  పిల్లలు కూడా ఈ అవస్థకు గురి కావడం సహజం.

ఈ అస్థిరతకు గురైనవారందరూ అపాయంలో వున్నట్టు కాదు.  అలా అని పైనుదహరించిన సంఘటనలకు గురైన వారందరూ ఈ అస్థిరతకు లోను కాగలరని చెప్పలేము.

చాలా కారణ అంశాలు ఈ అవస్థకు తోడ్పడవచ్చు.  అయితే కొన్ని అపాయకరమైన పరిస్తితులు అస్థిరతకు దారి తీయవచ్చు.  కొన్ని ప్రతిఘటనా శక్తులు ఈ అస్తిరత తగ్గడానికి తోడ్పడవచ్చు.  వీటిలో కొన్ని అంశాలు మానసిక అస్థిరతకు ముందుగానే రావచ్చు.  మరికొన్ని ఈ పరిస్థితి వచ్చిన తరువాత రావడానికి అవకాశం వుంటుంది.

పిల్లలు, యుక్త వయసులో వున్నవారికి మానసికోద్వేగ అస్థిరతకు ఎక్కువగా ప్రతిస్పందన వుంటుంది.  కానీ లక్షణాలు వేరుగా ఉండవచ్చు.  పిల్లల్లో ఈ లక్షణాలు:

 • నిద్రలో మూత్ర విసర్జన
 • మతిమరుపు లేక సరిగ్గా మాట్లాడలేక పోవడం
 • ఆడుకునే సమయంలో భయపెట్టే అంశాలను అభినయించడం
 • తల్లిదండ్రులతో అసాధారణంగా అంటిపట్టుకొని ఉండటం

పెద్ద పిల్లలు ఈ అవస్థకు గురైతే వారిలో విధ్వంసక, అగౌరవనీయమైన, ధ్వంస ప్రవర్తనలను చూడవచ్చు.  వారిలో మరణాన్ని గానీ ఒక పోట్లాట గానీ అపలేకపోయామన్న అపరాదియన్న భావాన్ని కలిగే అవకాశం వుంటుంది.  అందువలన ప్రతీకార చర్యకు సంబందించిన ఆలోచనలు రావచ్చు.  ఈ అవస్థ  మనుషుల మానసిక వ్యవస్థ బట్టి విభిన్న కాలాల్లో రావచ్చు.  ఈ లక్షణాలు ఏదైనా విధ్వంసక చర్య జరిగిన వెను వెంటనే మొదలు కావచ్చు లేక కొన్ని సంవత్సరాల తరువాత రావచ్చు.

రోగ లక్షణాలు, సూచనలు

1.పునర్వానుభావం

 • అదే అనుభవం మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం (ఇవి భౌతికానుభావాలు – గుండె కొట్టుకోవడం, చెమట పట్టడం)
 • చెడ్డ కలలు
 • భయభ్రాంతమైన ఆలోచనలు రావడం

ఇవి నిత్యం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంటాయి.  వ్యక్తి స్వంత ఆలోచనలు, వేదనల నుండి కలుగవచ్చు.

2.తప్పించుకునే లక్షణాలు

 • వ్యక్తుల నుండి, వస్తువుల నుండి, సంఘటనల నుండి దూరంగా వుండడం
 • ఉద్విగ్న భరితమైన పరిస్థితిలో మొద్దు బారి పోవడం
 • విచారం, స్తబ్ధత, నేర దోషం
 • ప్రతి నిత్యం చేసే పనుల్లో శ్రద్ధ చూపకపోవడం
 • ప్రమాదకరమైన సంఘటనను గుర్తు పెట్టుకో లేకపోవడం

ఇవి దిన చర్యని కూడా మార్చే అవకాశం వుంటుంది.  ఒక కారు ప్రమాదం జరిగితే ఆ వ్యక్తి కొన్నాళ్ళు కారు నడపడానికి ఇష్టపడక పోవచ్చు.

3.ఉద్రేకభరితం

 • త్వరగా ఉలికిపాటు, బెదురుపాటుకి లోను కావడం
 • బిగుసుపాటుకి లోనుకావడం
 • నిద్రలేమి, కోపానికి గురి కావడం

ఈ లక్షణాలు శాస్వతంగా వుంటాయి.  వ్యక్తి మనో బలం బట్టి ఒత్తిడికి గురి కావడం, కోపానికి గురికావడం జరుగుతుంది.  ఏకాగ్రతకు, నిద్రకు, తిండి మొదలైన కార్యకలాపాలకు ఈ లక్షణాలు అవరోధం కల్పిస్తాయి.  ఒక అపాయకరమైన దుర్ఘటన జరిగిన తరువాత ఈ లక్షణాలు రావడం సర్వసాధారణం.  కొన్ని వారాల్లోనే ఈ లక్షణాలు మాయమైపోవచ్చు.  దీన్నే ఎక్యుట్ స్ట్రెస్ డిసార్డర్ (ASD) అంటారు.  ఈ లక్షణాలు కొన్ని వారాల తరువాత కూడా ఇంకా కొనసాగితే అప్పుడు PTSD గా మరే అవకాశం వుంటుంది.  కొంత మందిలో చాలా కాలం తరువాత కానీ ఈ లక్షణాలు కనపడవు.

బయటపడడం ఎలా?

ముఖ్యంగా మానసిక చికిత్స, ఔషధాలు ఈ వ్యాధికి ఉపయోగిస్తే మంచిది.  ఒక వ్యక్తికీ ఉపయోగించే చికిత్స మరొకరికి పని చేస్తుందన్నది చెప్పలేం.  ఈ ప్రక్రియలో మానసిక చికిత్స నిపుణులను సంప్రదిస్తే బాగుంటుంది.  కొంతమంది వివిధ రకాలైన వైద్య చికిత్సల్ని ప్రయత్నించక తప్పదు.

దీర్ఘకాలిక మానసిక అవస్థకు గురై నట్లయితే తమ సంబంధ బాంధవ్యాల్లో తేడాలు, మార్పులు రావచ్చు.  అప్పుడు బహు విధములైన సమస్యలు తీర్చవలసిన అవసరం వుంటుంది.  వాటిలో క్రమరాహిత్యము, మాదక ద్రవ్యాలు, ప్రాణహాని కూడా వుంటాయి.

మానసిక రుగ్మత (Mental Illness) ను తగ్గించడానికి మానసిక చికిత్స నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం.  ఈ చికిత్స (Psychotherapy) ఒక్కరికే కాకుండా గ్రూపులుగా కూడా జరుపవచ్చు.  ఇది 6 – 12 వారాల మధ్య కాలం పడుతుంది.  ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోద్బలం ఈ చికిత్సలో ఎంతో తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

కొన్ని వ్యాధి నివారణ పద్ధతులు PTSD లక్షణాలను ఎదుర్కొంటాయి.  మరికొన్ని సామాజిక, కుటుంబ, ఉద్యోగ సమస్యలను తొలగించడానికి ఉపయోగపడతాయి.  అయితే ప్రతీ వ్యక్తికి భిన్న లక్షణాలుండడం అనివార్యం కనుక అన్ని నివారణ పద్ధతులు పరిశీలించడం మంచిది.

వాగ్వైద్యం (Talk therapy) ఎలా ఉపయోగపడుతుంది?

భయానకమైన సంఘటనలకు ఎలా స్పందించాలన్నది వాగ్వైద్యం ద్వారా నెరవేర వచ్చు.  ఇందులో…

 • మానసికోద్వేగ అస్థిరత గురించి కూలంకుషంగా చర్చిండం
 • మనోవినోద ఆనంద కరము, కోపతాపాలు స్వాధీన పరచుకోవడం
 • నిద్ర, ఆహార విషయాలు, వ్యాయామం అలవాట్లు గురించి తెలుసుకోవడం
 • ఈ వ్యాధి ఉన్నవారిని గుర్తించడం
 • ఈ లక్షణాలున్న వారిలో మార్పులు, ప్రతిస్పందనలు గమనించడం.  వారిని మరల దైనందిన జీవితంలోకి తీసుకురావడం

Information/Resources

 • For immediate assistance call Lifeline on 13 11 14.
 • Beyondblue  1300 22 4636
 • Download a copy of Recovery after Trauma – A Guide for People with Posttraumatic Stress Disorder from www.phoenixaustralia.org.
 • Talk to your GP
 • Visit www.phoenixaustralia.org for a list of relevant services.

Contributed by

Dr.Sridevi Kolli
Clinical Psychologist | Aged Persons Mental Health Team | Monash Health

Send a Comment

Your email address will not be published.