మురళి ముషాయిర – 2

భువన విజయం క్రియాశీలక సభ్యుడు మరియు ముషాయిరా మాంత్రికుడు శ్రీ మురళి ధర్మపురి తమ రెండవ పుస్తకాన్ని జనవరి 31 వ తేదీన హైదరాబాదు లోని సారస్వత పరిషత్తు హాలులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరియు పద్మభూషణ్ శ్రీ సి.నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.

ఈ పుస్తకంలో శాయిరీలు తెలుగు, ఆంగ్లము మరియు హిందీ భాషల్లో త్రిభాషా సూత్రాన్ని పాటిస్తూ భారతదేశం లోని అన్ని ప్రాంతాల వాళ్ళకు అర్ధం అయ్యేటట్లు కొన్ని హాస్యంగా వున్నా నిజాన్ని నిర్దిష్టంగా తెలిపేటట్లు వ్రాసారు శ్రీ మురళి గారు.

ఈ పుస్తకాన్ని మురళి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు  శ్రీ ఆచార్య మసన చెన్నప్ప గారికి అంకితం ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి కళా కోవిదులు, విశిష్ట అతిధులు, సినిమా రంగ ప్రముఖులు, సాహిత్య సిరోమణులు మున్నగువారెందరో హాజరైనారు.  వారిలో ముఖ్యంగా నటి సినీ నటులు శ్రీ రంగనాథ్, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ బైస దేవదాసు – నేటినిజం సంపాదకులు, ఆచార్య sri కాసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ వేదాంత శాస్త్రవేత్త శ్రీ శ్రీ ఎమ్వీ నరసింహారెడ్డి, ప్రముఖ రచయితే శ్రీ దాస్యం సేనాధిపతి,  శ్రీ ఎల్ది సుదర్శన్ (ముంబై), శ్రీ సంగివేని రవీంద్ర, శ్రీ వివేకానంద ఎడ్యుకేషనల్ అధ్యక్షులు శ్రీ భోగ సహదేవ్ వున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉజ్వల క్రియేషన్స్ – డా.సూర్య ధనంజయ మరియు ధనంజయ నాయక్ వారి అధ్వర్యంలో నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.