మూగబోయిన "రుద్రవీణ"

ఆయన రాసిన నాటికలు పావలా, కొడుకు పుట్టాలా అనే వాటిని ఎన్నో సార్లు మద్రాస్ ఆకాశవాణి లో ప్రసారమయ్యాయి. రంగస్థలంపై ప్రదర్సిమ్పబడ్డాయి. ఈ రెండు నాటికల్లో ‘కొడుకు పుట్టాలా’ అన్ని భారతీయ భాషల్లోనూ అనువదించారు. గణేష్ పాత్రో అంటే ఒకప్పుడు ఆయనే సినిమాలకు సంభాషణలు వ్రాయాలని తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురు చూసే వాళ్ళు. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకులు శ్రీ కోడి రామకృష్ణ గారి 20 కి పైగా సినిమాలకు సంభాషణలు వ్రాసారు. ప్రముఖ దర్శకుడు శ్రీ బాలచందర్ దర్సకత్వం వహించిన చాలా సినిమాలకు అయన సంభాషణలు వ్రాయడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతీ మాట ఒక సౌందర్య వనం. ప్రతీ వాక్కు తెలుగునాట పరిమళం.

గణేష్ పాత్రో ప్రముఖ నాటక రచయితగా, సినీ రచయితగా యెనలేని పేరుప్రఖ్యాతులు గడించారు. పార్వతీపురంలో 1945 జూన్ 22వ తేదీన పుట్టిన గణేష్ పాత్రో 1975 లో నాకూ స్వతంత్రం వచ్చింది అనే సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించారు. కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న గణేష్ పాత్రో 2015 జనవరి 5వ తేదీన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆయన 1970 ప్రాంతంలో రచన ప్రారంభించారు. మొదట్లో గొప్ప నాటకకర్తగా పేరు పొందిన గణేష్ పాత్రో రాసిన ప్రతి నాటిక, నాటకము ఆయనకు విశేషంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సమాజంలో జరిగే సంఘటనలను ఇతివృత్తంగా చేసుకని వాటిని తన రచనల ద్వారా జనం ముందుకు తీసుకురావడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్న ఆయన కథ, మాటల కూర్పు భలేగా ఆకట్టుకునేవి.

ఇటీవలే మరణించిన తమిళ దర్శకుడు కె బాలచందర్ తో దగ్గరి అనుబంధమున్న గణేష్ పాత్రో 1970 నుండి 1990 సంవత్సరాల మధ్య ఎన్నో ఉత్తమ చిత్రాలకు మాటలు రాసారు. ఆ తర్వాత పదిహేనేళ్ళకు మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రంలో ఆయన ప్రకాష్ రాజ్ పాత్రను మలచడంలో గానీ ఆ పాత్రకు రాసిన మాటలు గానీ చిరస్మరణీయం.

స్కూల్ పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా ఎంతో ఆసక్తితో చదివిన గణేష్ పాత్రో కొన్ని కవితలు కూడా రాసారు.
శ్రీ పాత్రో గారికి ఎన్నెన్నో అవార్డులు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు: ఆకలి రాజ్యం, సీతారామయ్యగారి మనవరాలు, స్వాతి, మయూరి. వీరికి అక్కినేని నాగేశ్వర రావు పుట్టినరోజు అవార్డు (2009) మరియు ఆత్రేయ సాహితీ అవార్డు (2013) కూడా లభించాయి.
ఆయన రాసిన కొన్ని సినిమాలు… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, మా పల్లెలో గోపాలుడు, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, అత్తవారిల్లు
.
అలాగే ఆయన అల్లుడొచ్చాడు, అందమైన అనుభవం, అపరాధి ఎవరు, నిర్ణయం, పెళ్ళాం చెబితే వినాలి వంటి సినిమాలకు పాటలు రాసారు. ఆయన రాసిన పాటల్లో ఇప్పటికీ యువతను కట్టిపడేసే పాట – హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం….మగాడితో ఆడదానికేలా పౌరుషం…ప్రేమించాను దీన్నే …కాదంటోంది నన్నే.. మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ని ….

Send a Comment

Your email address will not be published.