మెగా స్టార్ కుటుంబం ఎయిర్ లైన్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సినీ హీరో, మాజీ కేంద్ర మంత్రి కుమారుడు రామ్ చరణ్ తేజ ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి ఉమేష్ తో కలిసి టర్బో మెగా ఎయిర్ వేస్ పేరుతో గత మార్చి నెలలో కంపెనీని నెలకొల్పారు. దీనికి హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రం. విజయవాడ కేంద్రంగా ప్రారంభం అయిన ఎయిర్ కోస్తా లాగానే ఇది కూడా చిన్న పట్టణాలు, నగరాల మధ్య విమానాలను నడుపుతుంది. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అశోక్ గజపతి రాజు దేశవ్యాప్తంగా ఆరు విమానయాన సంస్థలకు అనుమతి మంజూరు చేసారు. వాటిల్లో మెగా ఎయిర్ వేస్ కూడా ఒకటి. ఈ ఏడాది చివరి నుంచి టర్బో మెగా ఎయిర్ వేస్ నుంచి విమానాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.