మెల్బోర్న్ ఘంటసాల

రాజమహేంద్రవరం సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు. పేరులోనే ఒక “వరం”, “రాజసం”, “మహేంద్రం”. సంగీత సాహిత్యాభిమానులకు ఒక “వరం”, కళాకారులకు “రాజసం”, భాషాభిమానులకు “మహేంద్రం”. ఈ రాజమహెంద్రంలో పెరిగి మెల్బోర్న్ నగరానికి ఒక వరప్రసాదంగా వచ్చారు డా. చారి ముడుంబి గారు.

<a href=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/12/Dr-Chari.jpg”><img class=”alignnone size-full wp-image-14726″ title=”Dr Chari” src=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/12/Dr-Chari.jpg” alt=”” width=”758″ height=”516″ /></a>గళం విప్పితే ఒక ఘంటసాల. కలం పడితే ఒక జంధ్యాల.

అన్నమాచార్య కీర్తనల నుండి మహా భారతంలోని పద్యాలు, సాంఘిక పరమైన పాటలు – నాలుగు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ) ఎన్నో కచేరీలు స్వయంగా నిర్వహించి, ఎన్నెన్నో బహుమతులందుకున్నా ఎంతో నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్న శ్రీ చారి ముడుంబి గారికి ఈ నెల 3 వ తేదీన విక్టోరియన్ మల్టీ కల్చరల్ కమిషన్ వారు మెరిటొరియస్ సర్వీస్ ఎక్స్లెన్స్ అవార్డుతో సత్కరించారు.

మెల్బోర్న్ ఘంటసాలగా పేరొందిన శ్రీ చారి గారు ఆంధ్రప్రదేశ్లో తణుకు పట్టణ వాస్తవ్యులు. వారి తలిదండ్రులు శ్రీ శేషాచారి మరియు అచ్చమ్మ గార్లు. చదువుకని రాజమండ్రి వచ్చి అక్కడే సంగీతం మరియు తెలుగు భాషపై అభిరుచి పెంచుకొని పాటల కచేరీలలో పాల్గొనడం హాస్య నాటికలు వ్రాయడం చేసేవారు. ప్రముఖ గాయకులు శ్రీ ఘంటసాల గారు పాడిన పాటలంటే ప్రాణం. పద్యాలు అందులోని గమకాలు పాడడంలోనూ బహు నేర్పరి. అన్నమయ్య మ్యూజిక్ ఆస్ట్రేలియా అన్న సంస్థని స్థాపించి అన్నమాచార్య కీర్తనలు పాడే కార్యక్రమం ప్రతీ ఏటా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి తెలుగు సంఘం వారు నిర్వహించే కార్యక్రమాలకు చక్కని సంగీతపరమైన పాటల్ని అందించి తన సేవలందిస్తూ ఉంటారు. చక్కని హాస్య నాటికలు, కధలు వ్రాసి రంగస్థలంపై ప్రదర్సనలిస్తూ ఉంటారు.

<a href=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/12/IMG-20151206.jpg”><img class=”alignleft wp-image-14727″ title=”IMG-20151206″ src=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/12/IMG-20151206.jpg” alt=”” width=”300″ height=”509″ /></a>“ఇంటి నుండి పని చేయుట”, “డాబేజీ”, “సింగపూర్ చొం చొం గులాబీ గొం గొం”, “అర్ధనారీశ్వరం” , “స్వర్గలోకంలో సరిగమలు”, “కంకుటకుం ఉవాచ”, “కకాకి కీకాకి”, “బామా (బాట మార్గదర్శి)”, “డా. సైబర్ శాస్త్రి” – ఇలా ఎన్నో హాస్యకధలు వ్రాసి భువన విజయం వారు ప్రచురించిన “కవితాస్త్రాలయ” పుస్తకంలో ప్రచురించడం జరిగింది. వీటితో పాటు చాలా హాస్యనాటికలు రచించి స్వయంగా నటించి దర్సకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.

శ్రీ పారుపల్లి రంగనాథ్, శ్రీ ఉన్ని కృష్ణన్, శ్రీమతి గీతామాధురి వంటి నిష్ణాతులైన కళాకారులతో పాటల కచేరీలో పాల్గొని ప్రశంసలు పొందిన శ్రీ చారి గారు మెల్బోర్న్ నగరంలోనే కాకుండా సిడ్నీ, కాన్బెర్రా నగరాల్లో కూడా ప్రదర్శనలిచ్చి పలువురి మెప్పు చూరగొన్నారు. డా.అక్కినేని నాగేశ్వర రావు మరియు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి మహోన్నతమైన నటుల కార్యక్రమాలకు వాచస్పతిగా కూడా వ్యవహరించి వారి ప్రశంసలందుకున్నారు.

2013 లో సిడ్నీలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో జరిగిన “జాతర” కార్యక్రమంలో పోలీసు వేషం వేస్తే చాలామంది ప్రముఖ హాస్యనటుడు “బ్రహ్మానందం” అక్కడికి వచ్చారనుకుని ఆశ్చర్యపోయారు.

వ్రుత్తి పరంగా కంప్యూటర్ ఇంజనీరుగా ANZ బ్యాంకులో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. భారతదేశంలో వున్నపుడు బొంబాయి ఐ ఐ టి లో డాక్టరేట్ పట్టా పుచ్చుకొని CMC లో కొన్నాళ్ళు పనిచేసి 1985 లో మెల్బోర్న్ రావడం జరిగింది.

పాతతరం సంగీత దర్సకులందరికీ నివాళిగా ఒక సంగీత కార్యక్రమం నిర్వహించి వారందించిన సంగీత జ్ఞాన నిధికి వందన సమర్పణ చేయాలని వుందని తన మనసులోని కోరికను తెలిపారు.

సాహితీ సంవేదిక భువన విజయం క్రియాశీలక సభ్యునిగా, ఒక భాషాభిమానిగా, ఒక సంగీత కళాకారునిగా మరెన్నో అవార్డులు అందుకోవాలని తెలుగుమల్లి అకాంక్షిస్తుంది.

Send a Comment

Your email address will not be published.