మేటిగా, దీటుగా రాజధాని

మేటిగా, దీటుగా రాజధాని
అత్యాధునిక, సుస్థిర అత్యున్నత సామాజిక అవసరాలను తీర్చే ప్రపంచ శ్రేణి
రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి సింగపూర్
ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక అవగాహన
ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో సింగపూర్ వాణిజ్య శాఖ
మంత్రి ఈశ్వరన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు,
అధికారులు పాల్గొన్నారు. ఈ ప్లాన్ ప్రకారం, రాష్ట్ర రాజధానితో సహా సమీప
ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. స్మార్ట్ సిటీల
రూపకల్పనలో సిద్ధహస్తురాలయిన సింగపూర్ ఈ రాజధాని నిర్మాణంలో కూడా కీలక
పాత్ర పోషించాలి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి పట్టణాల మధ్య 7,325
చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం
భూమి సేకరణ చేపట్టింది. ఈ ప్రాంత రైతులతో చంద్రబాబు విడతల వారీగా చర్చలు
జరుపుతూ, వాళ్లకు ప్యాకేజీలు ఇవ్వజూపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి
మొదటి దాస రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరు
నెలల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇస్తామని, అది ఆమోదం పొందితే వెంటనే
నిర్మాణం ప్రారంభించ వచ్చని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.