మేడ్చల్ వద్ద ఫుడ్ పార్క్

హైదరాబాద్ సమీపంలో భారీ ప్రాజెక్టును నెలకొల్పడానికి ఐ.టి.సి ఏర్పాట్లు చేస్తోంది. నగర శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో భారీ ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని అది తలపెట్టింది. సుమారు 800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుకు తెలంగాణా ప్రభుత్వం 12 రోజుల్లో అనుమతులు మంజూరు చేసింది. ఐ.టి.సి ప్రధాన కార్య నిర్వాహక అధికారి సంజయ్ సింగ్ ఈ సంగతి చెప్పారు. ఈ ఫుడ్ పార్కు ద్వారా వేల సంఖ్యలో స్థానికులకు ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు. ఇది కాక, భద్రాచలం వద్ద ఐ.టి.సి కొత్తగా ఏర్పాటు చేసే పేపర్ యూనిట్ కు ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించబోతోంది. అయిదు వేల కోట్ల పెట్టుబడితో, అయిదు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త యూనిట్ ను ఏర్పాటు చేస్తామని సంజయ్ సింగ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.