మైక్రో సాఫ్ట్ సంస్థకు తెలుగు అధినేత

ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ దిగ్గజం అయిన మైక్రో సాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓగా  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 46 ఏళ్ళ  సత్య  నాదెండ్ల  నియమితులయ్యారు. ఈ సంస్థ గత అయిదు నెలలుగా సారథి కోసం వెతుకుతోంది. ఇప్పటి వరకూ ఈ సంస్థ చైర్మన్ గా  ఉన్న బిల్ గేట్స్ ఇక సాంకేతిక సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తారు. ఈ సాంకేతిక విప్లవ సంధి కాలంలో సత్య నైపుణ్యాలు ఈ సంస్థను సరైన దిశగా నడిపించగలవని బిల్ గేట్స్ అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న సత్య ప్రముఖ ఐ.ఎ. ఎస్ అధికారి యుగంధర్ కుమారుడు. ఆయన అనంతపురం జిల్లా సింగనమల మండలం బుక్కాపురం గ్రామానికి చెందినవారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సహాయంతో సత్య తన గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. 1996లొ మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య ఆ సంస్థ వ్యాపారాన్ని తొమ్మిది వేల కోట్ల నుంచి 31 వేల కోట్ల రూపాయలకు చేర్చారు. ఇద్దరి ఆడపిల్లలు ఉన్న సత్య ప్రస్తుతం వాషింగ్టన్ లో స్థిరపడ్డారు.

Send a Comment

Your email address will not be published.