మోగింది నగారా ...కోడ్ కూసింది

దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి అధికారికంగా ఆరంభమైంది.

భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది. వచ్చే నెల ఏడో  తేదీన మొదలయ్యే ఎన్నికల చిత్రం తొమ్మిది దశలలో సాగి మే నెల 12 వ తేదీ వరకు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడీసా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 7 వ తేదీన, రెండవ దశ  పోలింగ్ ఏప్రిల్ 9 వ తేదీన, మూడవ దశ పోలింగ్ ఏప్రిల్ 10 న, నాలుగవ దశ పోలింగ్ ఏప్రిల్ 12 న , అయిదవ దశ పోలింగ్ ఏప్రిల్ 17 న , ఆరవ దశ పోలింగ్ ఏప్రిల్ 24 న, ఏడవ దశ పోలింగ్ ఏప్రిల్ 30 న, ఎనిమిదో దశ పోలింగ్ మే 7 న, తొమ్మిదో దశ పోలింగ్ మే 12 న నిర్వహిస్తారు. మే 16 న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. దేశవ్యా ప్తంగా 81.4 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీర్లి 9.71 కోట్ల మంది కొత్తగా ఓటరు జాబితాలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో తిరష్కరణ (నోటా) అమలు కానున్నది. అలాగే ఈ వీ ఎం లకు ఓటు ప్రింటింగ్ యంత్రాలను అమరుస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 న తెలంగాణలో, మే 7 న సీమాన్ధ్రలో ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం వోటర్లు 6.24 కోట్ల మంది. మొదటి దశలో తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలకు,119 అసెంబ్లీ స్థానాలకు, మే 7 న 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగు ఉంటుంది.

ఇది ఇలావుండగా, నటుడు పవన్ కళ్యాన్ ఈ నెల 9న పవన్ రాజ్యం పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న జై సమైక్య ఆంద్ర పేరుతో పార్టీని ప్రారంభించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి బీజీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.