మోడీ చుట్టూ తెలుగు తారలు

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ చుట్టూ తెలుగు తారలు తిరుగుతున్నారు. మోడీని బీజేపీ తమ ప్రధానిగా ప్రకటించిన తరువాత ఆయనను మొట్ట మొదటగా కలుసుకుని అభినందనలు  తెలియజేసిన నటుడు మోహన్ బాబు. ఆ తరువాత జూనియర్ ఎన్టీయార్ కలుసుకున్నారు. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్వయంగా అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలుసుకుని మద్దతు తెలియజేసి రావడమే కాకుండా, సొంతగా ఓ పార్టీ పెట్టి ఆయనే ప్రధాని కాగల నాయకుడని కూడా ప్రకటించారు. అంతే కాదు, బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఏర్పడేందుకు కూడా కృషి చేస్తున్నారు. నిన్న విశాఖపట్నంలో తమ పార్టీ జనసేన తరఫున ఓ బహిరంగసభను ఏర్పాటు చేసి మోడీని మించిన నాయకుడు లేదని కూడా స్పష్టం చేశారు. ఇది ఇలా వుండగా హీరో అక్కినేని నాగార్జున కూడా అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలుసుకుని ఆయనకు తమ మద్దతు తెలియజేసి వచ్చారు. మోడీని కలుసుకున్న వారిలో హాస్య నటుడు అలీ కూడా వున్నారు. కాగా మోహన్ బాబు ఆయనను మళ్ళీ కలుసుకోవడానికి అనుమతి కోరారని తెలిసింది.

నిజానికి మొదటి నుంచీ ఎన్టీయార్ కుటుంబం మోడీకి సన్నిహితంగా ఉంటూ వస్తోంది. తాము కూడా ఆయనకు సన్నిహితం కావాలని మిగిలిన స్టార్ కుటుంబాలు ఇప్పుడు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అంతేకాక, తమ కుటుంబం కూడా రాజకీయ కుటుంబంగా మారాలని భావిస్తున్న చిరంజీవి కుటుంబం ప్రస్తుతం పవన్ ద్వారా తమ ప్రయత్నం కొనసాగించదలచు కున్నట్టు కనిపిస్తోంది.

Send a Comment

Your email address will not be published.